ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.44
సూర్యాస్తమయం: సాయంత్రం.5.42
రాహుకాలం: మ.12.00 ల1.30
అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.
దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48
మేషం:

ఈరోజు మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఖర్చులు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఇంటికి బంధువులు రావడం వల్ల సంతోషంగా ఉంటారు.మీ విలువైన సమయాన్ని కాపాడుకోవాలి.
వృషభం:

ఈరోజు మీరు పనిచేసే చోట కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి వాదనలకు దిగకండి.కొన్ని వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.
కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.
పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం మంచిది.
సింహం:

ఈరోజు మీరు అనుకోకుండా ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.
కన్య:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.
పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులకు మీ వంతు సహాయం చేస్తారు.
కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.
తుల:

ఈరోజు మీరు సమాజంలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు.మీపై ఉన్న బాధ్యతల్ని విజయవంతంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.సమయానికి బయట ఇచ్చిన డబ్బులు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతికి అందుతుంది.మీరంటే గిట్టని వారు మీపై నిందలు మోపుతారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచె జరుగుతుంది.
ధనుస్సు:

ఈరోజు మీరు గతంలో పెట్టుబడులుగా పెట్టిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.ఈరోజు మీరు చేసే వ్యవసాయంలో లాభాలను పొందుతారు.మీ జీవిత భాగస్వామిగా కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.
మకరం:

ఈరోజు మీరు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.దగ్గర్లో ఉన్న వైద్యుని సంప్రదించడమే మంచిది.విద్యార్థులు ఈరోజు చదువుపై మరింత దృష్టి పెట్టాలి.
ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల అనేక లాభాలు ఎదురౌతాయి.తీరిక లేని సమయం తో గడుపుతారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.వ్యాపారస్థులు ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేయాలి.మీరు పని చెసే చోట అనుకూలంగా ఉంది.చాలా సంతోషంగా ఉంటారు.
మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా పలు చోట్ల నుండి లాభాలు ఉన్నాయి.దూర ప్రాంత బంధువు నుండి శుభవార్త వింటారు.దీన్ని వల్ల కుటుంబ సభ్యులతో పాటు సంతోషాన్ని పంచుకుంటారు.వ్యాపారస్తులకు లాభాయకంగా ఉంది.మీరు పని చేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.