1.రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు ముగింపు

రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ గడువు నేటితో ముగియనుంది.
2.రాకెట్ ప్రయోగానికి ఈరోజు కౌంట్ డౌన్ ప్రారంభం
రేపు జరగనున్న పిఎస్ఎల్వి సీ 53 ప్రయోగానికి ఈరోజు సాయంత్రం 5 గంటలకు కౌండౌన్ ప్రారంభం కానుంది.
3.వైసిపి ప్లేనరీ

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో నేడు వైసీపీ ప్లేనరీ సమావేశం జరగనుంది.ఈ కార్యక్రమానికి ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరుకానున్నారు.
4.తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఈరోజు మధ్యాహ్నం 3.30గంటలకు దోస్త్ నోటిఫికేషన్ జారీ.
5.సినీ నటి మీనా భర్త మృతి

సినీ నటి మీనా భర్త విద్యాసాగర్ (48) ఆకస్మిక మరణం చెందారు.పోస్ట్ కోవిడ్ సమస్యలతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
6.ఫెర్నాండేజ్ ఆసుపత్రికి 60 లక్షల జరిమానా
ఫెర్నాన్ డేస్ ఆసుపత్రికి హైదరాబాద్ వినియోగదారుల ఫోరం 60 లక్షల జరిమానా విధించింది.2019లో హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఒక గర్భిణీకి డాక్టర్లు నిర్లక్ష్యంతో వైద్యం చేయడంతో ఆమెకు పుట్టిన బిడ్డ అంగవైకల్యంతో జన్మించింది.దీనికిగాను హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు అందడంతో ఈ జరిమానా విధించారు.
7.నేడు, రేపు సికింద్రాబాద్ రాయపూర్ రైళ్ల రద్దు

సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈనెల 29, 30 తేదీల్లో సికింద్రాబాద్ రాయపూర్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
8.కెసిఆర్ పై షర్మిల కామెంట్స్
తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని , అవి ముమ్మాటికి సీఎం కేసీఆర్ చేస్తున్న హత్యలేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.
9.మంత్రి కొప్పుల మధ్యంతర పిటిషన్ తిరస్కరణ

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికకు సంబంధించిన వివాదంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.
10.భారత్ లో కరోనా
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 14,506 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
11.వరద బాధితులకు అమీర్ ఖాన్ సాయం

అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తు ఉండడం తో ఎన్నో ఇళ్ళు వరద నీటిలో మునిగిపోవడం తో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ స్పందించి అసోం సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు అందించారు.
12.సీనియర్ ఐపీఎస్ అధికారి సస్పెండ్
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు ను ఏపీ ప్రభుత్వం మరోసారి సస్పెండ్ చేసింది.క్రమశిక్షణ రహితంగా వ్యవహరించి, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎస్ సమీర్ శర్మ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
13.వ్యాపారవేత్త పల్లోంకి మిస్త్రి కన్నుమూత

ప్రముఖ వ్యాపారవేత్త పల్లోంజీ మిస్త్రీ (93) ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు.
14.సీఎం జగన్ పారిస్ టూర్
ఏపీ సీఎం జగన్ మంగళవారం రాత్రి పర్యటనకు బయలుదేరి వెళ్లారు జూలై 3 న ఆయన తిరిగి రానున్నారు.
15.ఎంపీ రఘురామ సంచలన కామెంట్స్

భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో తనను అరెస్టు చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వైఎస్సార్ సిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు.
16.సోము వీర్రాజు కామెంట్స్
రాజకీయ పార్టీల ప్రస్థానం ప్రజాస్వామ్యయుతంగా ఉండాలని ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.
17.వైసిపి పై నాదెండ్ల మనోహర్ విమర్శలు

ధర్మవరం ప్రెస్ క్లబ్ లో బిజెపి నేతలపై వైసీపీ నేతల దాడి చేసిన ఘటన పై జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు.ధర్మవరంలో బిజెపి నేతలపై వైసీపీ వాళ్ళు దాడి చేయడం అధికారపక్ష దౌర్జన్యాలను వెల్లడిస్తోంది అని విమర్శించారు.
18.సీఎఫ్ ఎంఎస్ చెల్లింపుల పై సింగిల్ జడ్జి ఉత్తర్వులు నిలిపివేత
గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు సీఎఫ్ ఎంఎస్ ద్వారా జరిపిన చెల్లింపుల బిల్లులు స్వీకరణ వివరాలను కోర్టు ముందుంచాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ని ఆదేశిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది .
19.త్వరలో ఏపీ భవన్ విభజన పూర్తి

ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న దేశ రాజధాని లోని ఏపీ భవన్ విభజన త్వరలోనే పూర్తవుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
20.సచివాలయంలో 85 అదనపు పోస్టులు
అమరావతి సచివాలయంలో 85 అదనపు పోస్టులు సృష్టికి సంబంధించిన ప్రతిపాదనకు ఏపీ సీఎం జగన్ ఆమోదం తెలిపారు.