టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో జెనీలియా( Genelia ) ఒకరు.పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ నటి సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
పదేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జెనీలియా వేద్ మూవీలో( Ved Movie ) యాక్ట్ చేసి సక్సెస్ అందుకున్నారు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ నటి తాను కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సమయంలో తెలిసిన వాళ్లు ఎవరూ ప్రోత్సహించలేదని తెలిపారు.
వాళ్ల మాటల వల్ల తాను ఎంతో బాధ పడ్డానని ఆమె కామెంట్లు చేశారు.కెరీర్ పరంగా సక్సెస్ ఫెయిల్యూర్ కు తను ప్రాధాన్యత ఇవ్వనని జెనీలియా చెప్పుకొచ్చారు.
జయాపజయాలు మన లైఫ్ లో భాగమేనని ఆమె కామెంట్లు చేశారు.

కాబట్టి మనం వాటి కంటే కూడా మనం లైఫ్ ఎలా కొనసాగిస్తున్నాం అనేది ముఖ్యమని జెనీలియా వెల్లడించారు.ఒక నటిగా దాదాపుగా ఆరు భాషల్లో పని చేశానని పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్ కు దూరం కావాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు.ఇటీవల తిరిగి కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకున్న సమయంలో తెలిసిన వాళ్లెవరూ ప్రోత్సహించలేదని జెనీలియా అభిప్రాయం వ్యక్తం చేశారు.

పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏ మాత్రం వర్కౌట్ కాదు? అని నిరాశ పరిచారని ఆమె పేర్కొన్నారు.ధైర్యం చేసి సినిమాల్లోకి తిరిగి వచ్చానని వేద్ సినిమా మంచి సక్సెస్ ను సొంతం చేసుకుంది కాబట్టి అన్ని విషయాల్లో ఇతరులను నమ్మడానికి వీలు లేదని జెనీలియా కామెంట్లు చేశారు.జెనీలియా చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.జెనీలియా రీఎంట్రీలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.







