సాధారణంగా ఇంట్లోకి దోమలు( Mosquitoes ) వస్తూనే ఉంటాయి.ముఖ్యంగా గ్రామాల్లో దోమల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది.
దోమల కారణంగా రాత్రుళ్ళు సరైన నిద్ర ఉండదు.పైగా దోమలు మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ వంటి అనేక రోగాలకు కారణం అవుతాయి.
ఈ నేపథ్యంలోనే ఇంట్లోని దోమలు తరిమి కొట్టేందుకు రకరకాల స్ప్రేలు, ఎలక్ట్రిక్ బ్యాట్లు వాడుతుంటారు.అయితే ఎటువంటి కెమికల్స్ వాడకుండా , పొల్యూషన్ జరక్కుండా కొన్ని కొన్ని ఇంటి చిట్కాలతో కూడా దోమలను నివారించవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే విధంగా దీపం పెట్టారంటే ఇంట్లో దోమలు పరావ్ అవ్వాల్సిందే.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు కొబ్బరినూనె( Coconut Oil ) మరియు హాఫ్ టీ స్పూన్ కర్పూరం పొడి( Camphor ) వేసి బాగా మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు కర్పూరం కలిపిన నూనెను మట్టి ప్రమిదలో పోసి దీపం వెలిగించండి.రాత్రి పడుకోవడానికి గంట లేదా రెండు గంటల ముందు ఇలా దీపం పెట్టి తలుపులు మూస్తే.
దీపం నుంచి వచ్చే పొగకు దోమలు బయటకు పరార్ అవుతాయి.దోమల బెడదను తగ్గించడంలో ఈ చిట్కా చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆవాల నూనెలో హాఫ్ టీ స్పూన్ కర్పూరం పొడి వేసి మిక్స్ చేయండి.ఇప్పుడు ఈ కర్పూరం కలిపిన ఆవ నూనెను రెండు బిర్యానీ ఆకులకు పట్టించండి.దోమలు ఎక్కువగా ఉన్న చోట ఈ బిర్యానీ ఆకులను కాల్చాలంటే ఆ పొగకు దోమలు అల్లాడిపోతాయి.ఇంట్లో నుంచి వెళ్లిపోతాయి.

ఇక వెల్లుల్లి వాసన దోమలకు అస్సలు గిట్టదు.కాబట్టి.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ బాయిల్ అయ్యాక అందులో రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి తురుము, వన్ టేబుల్ స్పూన్ ఆవనూనె వేసి పది నిమిషాల పాటు మరిగించండి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ నీటిని వడకట్టి స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.దోమలు ఉన్నచోట ఈ స్ప్రేను కొట్టారంటే అవి చస్తాయి.