జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ( Pahalgam, Jammu and Kashmir )ఏప్రిల్ 22న చోటుచేసుకున్న ఉగ్రదాడి దేశమంతటినీ విషాదంలో ముంచింది.అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన ఆకస్మిక దాడిలో 30 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం తీవ్ర ఆవేదన కలిగించింది.
ఈ ఘటన దేశవ్యాప్తంగా కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా తీవ్ర ఖండనకు గురైంది.ఈ దాడికి పాకిస్థాన్ సంబంధిత ఉగ్రవాద సంస్థ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’( The Resistant Front ) (TRF) బాధ్యత వహించడంతో, దాడి వెనుక పాకిస్థాన్ కుట్ర ఉందన్న అనుమానాలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి.
TRF అనేది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా అనుబంధ సంస్థగా గుర్తింపు పొందినదే కావడంతో, భారత్ ఆ దేశంపై నేరుగా యుద్దానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో, దాడి తర్వాత పాకిస్థాన్ హైకమిషన్ ఆఫీసులో కేక్ కటింగ్ జరిపారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.
కేక్ పట్టుకుని ఆఫీసులోకి వెళ్తున్న ఒక వ్యక్తిని మీడియా వరుసగా ప్రశ్నించినా, అతడు ఎటువంటి స్పందన ఇవ్వకుండా మౌనంగా ప్రవేశించడం కలకలం రేపుతోంది.ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ దాడికి తక్షణమే స్పందించిన భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌పై కొన్ని కీలక చర్యలు తీసుకుంది.

ఇందులో భాగంగా సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.పాకిస్థాన్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది.అలాగే భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల్లో దేశం విడిచిపెట్టు అనీ ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా న్యూఢిల్లీలోని పాక్ హైకమిషనర్‌ను పిలిపించి నాన్-పర్సోనా గ్రేటా కింద సమన్లు ఇచ్చింది.

ఇక ఈ అమానవీయ ఘటనపై ప్రపంచ దేశాలు గట్టిగా స్పందించాయి.పర్యాటకులపై జరిగిన ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలియజేశాయి.మరోవైపు, భారత ప్రజలలో తీవ్ర ఆగ్రహావేశం వ్యక్తమవుతోంది.
ఉగ్రవాదానికి పాక్ ప్రభుత్వ మౌన సహకారం ఉందన్న భావన బలపడుతోంది.ఈ ఘటన నేపథ్యంలో, దేశ భద్రతపై మరింత సురక్షిత చర్యలు అవసరమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉగ్రవాదంపై బలమైన పోరాటం అవసరమని, పాకిస్థాన్‌కి గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాదిస్తున్నారు.







