ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలమైన వ్యాపారవేత్తల్లో ఒకరైన ఎలాన్ మస్క్( Elon Musk ) టెక్నాలజీ, వ్యాపారం, అంతరిక్ష పరిశోధన, ఎలక్ట్రిక్ వాహనాలు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారు.టెస్లా, స్పేస్‌ఎక్స్, న్యూరాలింక్, ది బోరింగ్ కంపెనీ, xAI వంటి సంస్థల ద్వారా ప్రపంచ భవిష్యత్తును రూపుదిద్దుతున్నారు.2022లో ట్విట్టర్‌ను( Twitter ) కొనుగోలు చేసి, దాన్ని ‘ఎక్స్’గా( X ) ముద్రించిన మస్క్, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఎలాన్ మస్క్ అనూహ్యంగా ‘ఎక్స్’ను తన స్వంత AI కంపెనీ xAIకి విక్రయించినట్లు ప్రకటించారు.
ఈ ఒప్పందం విలువ సుమారు 33 బిలియన్లు డాలర్స్, ఇది పూర్తిగా స్టాక్ లావాదేవీగా జరిగింది.ఈ డీల్‌లో xAI మొత్తం విలువ 80 బిలియన్లు.‘ఎక్స్’ విలువ 33 బిలియన్లు (అప్పులతో కలిపితే 45 బిలియన్లు డాలర్స్)గా నిర్ణయించారు.ఈ ప్రకటన టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది.
ఎందుకంటే, ఇది మస్క్ వ్యాపార వ్యూహంలో కీలకమైన మలుపును సూచిస్తోంది.
2022లో మస్క్44 బిలియన్ల డాలర్స్ కు ట్విట్టర్‌ను కొనుగోలు చేసి దానికి ‘ఎక్స్’గా మళ్లీ బ్రాండింగ్ చేశారు.సంస్థకు పూర్తిగా కొత్త రూపాన్ని ఇచ్చే క్రమంలో సిబ్బంది తగ్గింపు, కంటెంట్ మోడరేషన్ నిబంధనల మార్పు ధృవీకరణ విధానాల సవరణ వంటి అనేక సంస్కరణలను తీసుకువచ్చారు.అయితే, ఈ మార్పుల వల్ల ప్రకటనదారులు వెనుకడుగు వేసినప్పటికీ 2025 నాటికి ‘ఎక్స్’ తన స్థిరత్వాన్ని తిరిగి పొందింది.
xAI అనేది 2023లో మస్క్ స్థాపించిన కృత్రిమ మేధస్సు (AI) సంస్థ.ఇది ఓపెన్‌ఏఐకు ప్రత్యర్థిగా అభివృద్ధి చెందుతోంది.
ఇప్పటికే xAI తన చాట్‌బాట్ “గ్రాక్”( Grok ) ను ‘ఎక్స్’లో అందుబాటులోకి తీసుకువచ్చింది.‘ఎక్స్’ను xAIకి విక్రయించడం ద్వారా, మస్క్ AI సామర్థ్యాలను సోషల్ మీడియాతో అనుసంధానం చేసి వినియోగదారులకు మెరుగైన సేవలను అందించాలనే వ్యూహాన్ని అవలంబించారు.ఈ ఒప్పందం తక్షణ మార్పులను తీసుకురాకపోయినా, రాబోయే నెలల్లో AI ఆధారిత ఫీచర్లు వేగంగా అందుబాటులోకి రానున్నాయి.టెక్ పరిశ్రమలో ఇది సోషల్ మీడియా, AI కలయికకు కొత్త దిశను సూచించే ఒప్పందంగా మారింది.
ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.కానీ, ఇది మస్క్ వ్యాపార దూరదృష్టికి నిదర్శనంగా నిలుస్తోంది.