సాధారణంగా ప్రజలు రకరకాల నిక్ నేమ్స్ పెట్టుకుంటారు.సినీ సెలబ్రిటీలకు ( celebrities )కూడా నిక్ నేమ్స్ ఉంటాయి.
ఈ ముద్దు పేర్లను ఎక్కువగా తల్లిదండ్రులు పెడుతుంటారు.ఆ తర్వాత వారి లైఫ్ పార్టనర్ నిక్ నేమ్స్ నిర్ణయిస్తుంటారు.
ఓన్లీ ఫ్యామిలీ సమక్షంలోనే ఇలాంటి ముద్దు పేర్లతో పిలుస్తారు కాబట్టి ఫ్యాన్స్, సినీ ప్రేక్షకుల వంటి బయట వ్యక్తులకు అవి తెలిసే అవకాశం తక్కువ.ఒక్కోసారి మాత్రం సెలబ్రిటీల ముద్దు పేర్లు బయటికి వస్తుంటాయి.
అలా కొంతమంది నిక్ నేమ్స్ తెలిసాయి.వాళ్ళు ఎవరో, వారి నిక్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాం.
• ఎస్ఎస్ రాజమౌళి
( SS Rajamouli )
సినిమా వాళ్ళందరూ దర్శక దిగ్గజం రాజమౌళిని జక్కన్న అనే ముద్దుగా పిలుచుకుంటారు.అయితే అతని సతీమణి రమా రాజమౌళి మాత్రం డూడూ ( Dodo ) అంటూ అతడిని స్వీట్ గా పిలుచుకుంటుంది.
నిజానికి డూడూ అంటే ఒక పక్షి.అది ఎగరలేదు.చాలా బద్ధకంగా ఉంటుంది నెమ్మదిగా కదులుతుంది.నిజానికి ఈ పక్షికి రాజమౌళి పూర్తిగా విరుద్ధంగా ఉంటారు.
ఆ ముద్దు పేరు ఆమె ఎందుకు పెట్టారో ఆమెకే తెలియాలి.

• సాయి పల్లవి
( Sai Pallavi )
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.లేడీ సూపర్ స్టార్ గా బిరుదు తెచ్చుకుంది.అయితే ఈ అందాల తారను బాగా దగ్గరైన వారు “పల్లు”( Pallu ) అని చాలా స్వీట్ గా పిలుస్తారట.
ఇక హీరో నాని అయితే ఈమెని పల్లవి అంటూ చాలా ముద్దుగా పిలుస్తాడు.

• పూరి జగన్నాథ్
( Puri Jagannath )
మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కి యాపిల్ పండ్లు అంటే చాలా ఇష్టం.ఆ ఇష్టంతోనే తనకు నచ్చిన వారిని పండు( Pandu ) అని పిలుస్తుంటారు.ముఖ్యంగా తన భార్య లావణ్యకు పండు అని ఒక నిక్ నేమ్ కూడా పెట్టాడు.
ఇక ప్రియమైన వారు మాత్రమే కాకుండా టాలీవుడ్ సెలబ్రిటీలకు అభిమానులు, ఇతర సెలబ్రిటీలు పెట్టిన నిక్ నేమ్స్ ఎన్నో ఉన్నాయి.మహేష్ బాబును ముద్దుగా ప్రిన్స్ అని పిలుస్తారు.
సంపూర్ణేష్ బాబును బర్నింగ్ స్టార్ అని ఫన్నీగా పిలుస్తారు.జూనియర్ ఎన్టీఆర్‌ను, యంగ్ టైగర్ అని బ్రహ్మీ, సునీల్ ను గోల్డెన్ స్టార్, మంచు మనోజ్ ను రాకింగ్ స్టార్ అంటూ ముద్దుగా అంటారు.