యంగ్ హీరోయిన్ శృతి నారాయణన్( Shruthi Narayanan ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ హీరోయిన్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కొంతమంది స్కామర్లు( Scammers ) అడిషన్ పేరుతో శృతి నారాయణన్ శరీరంపై దుస్తులు లేకుండా వీడియో రికార్డ్ చేయడం గమనార్హం.ఈ వీడియోను పలు వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడం గమనార్హం.
ఈ వీడియో నెట్టింట వైరల్ కాగా ఈ వ్యవహారం గురించి శృతి నారాయణన్ రియాక్ట్ అయ్యారు.దయచేసి వీడియో లింకులు అడగడం ఆపేయండని శృతి పేర్కొన్నారు.సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి వరుసగా పోస్టులు పెట్టారు.శృతి నారాయణన్ మాట్లాడుతూ నా గురించి వైరల్ అవుతున్న వీడియో( Viral Video ) మీకు సరదాగా ఉందేమో అని చెప్పుకొచ్చారు.

అయితే ఆ వీడియో నాకు, నా కుటుంబానికి ఎంత కష్టంగా ఉందో తెలుసా అంటూ ఆమె కామెంట్లు చేశారు.నాకేం చేయాలో పాలు పోవట్లేదని నేనొక అమ్మాయినని నాకూ ఎమోషన్స్ ఉంటాయని ఆమె వెల్లడించారు.నా చుట్టూ ఉండేవారికి కూడా ఎమోషన్స్ ఉంటాయని శృతి నారాయణన్ పేర్కొన్నారు.మీరు పరిస్థితిని మరింత అధ్వాణ్ణంగా మారుస్తాయని ఆమె చెప్పుకొచ్చారు.

దయచేసి ఆ వీడియోను వైరల్ చేయవద్దని మీకు అంతగా కావాల్సి వస్తే మీ అమ్మదో చెల్లిదో ప్రేయసిదో వీడియోలు చూడండని శృతి నారాయణన్ కామెంట్లు చేశారు.వాళ్లకు కూడా నాలాంటి శరీరమే ఉంటుందని చెప్పుకొచ్చారు.ఆ వీడియోలు లీక్ చేసిన వాళ్లది? ఆ వీడియోలు చూసేవాళ్లది తప్పు కాదా? అని ప్రశ్నించారు.శృతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ వుతున్నాయి.
శృతి నారాయణన్ కెరీర్ పరంగా బిజీ కావాలని ఆమె అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.