టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రతిష్టాత్మక బ్యానర్లలో సితార ఎంటర్టైన్మెంట్స్( Sithara Entertainments ) కూడా ఒకటి.అయితే సితార బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతున్నా ఈ సినిమాకు పోటీగా విడుదలైన సినిమాలు అంతకు మించి హిట్ గా నిలుస్తుండటం సితారకు షాకిచ్చింది.
హనుమాన్, క, అమరన్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల రూపంలో సితారకు భారీ షాకులు తగిలాయనే సంగతి తెలిసిందే.
అయితే మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమా మాత్రం ఆ నెగిటివ్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.ఎల్2 ఎంపురాన్, రాబిన్ హుడ్ సినిమాలను మించి మ్యాడ్ స్క్వేర్ మూవీ కలెక్షన్లను సాధించడం హాట్ టాపిక్ అవుతోంది.మ్యాడ్ స్క్వేర్ మూవీ ఈరోజు, రేపు కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించి రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

రాబోయే రోజుల్లో నిర్మాత నాగవంశీ( Producer Nagavamshi ) మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటుందేమో చూడాల్సి ఉంది.నాగవంశీ తన సక్సెస్ రేట్ తో మిగతా ప్రొడ్యూసర్లను ఆశ్చర్యపరుస్తున్నారు.నాగవంశీ సితార బ్యానర్ ను నంబర్1 గా నిలపడంలో తన వంతు కష్టపడుతున్నారని చెప్పడంలో సందేహం అవసరం లేదు.నాగవంశీకి సైతం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో క్రేజ్ ఉందని చెప్పవచ్చు.

ఈతరం ప్రేక్షకులకు నచ్చే కథాంశాలతో సినిమాలను నిర్మిస్తుండటం సితార బ్యానర్ కు ప్లస్ అవుతోంది.ఈ సంస్థ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లను నిర్మించనుంది.మ్యాడ్ స్క్వేర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.మ్యాడ్2 సినిమాలో ఫస్టాఫ్ అద్భుతంగా ఉండగా సెకండాఫ్ ప్రేక్షకులను మెప్పించలేదు.మ్యాడ్2 సినిమాలో సంతోష్ శోభన్, విష్ణు కామెడీ బాగుంది.అయితే మ్యాడ్2 మ్యాడ్ స్థాయిలో లేకపోవడం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.