యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2( War 2 ) సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలతో పాటు మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈయన డ్రాగన్ సినిమాలో కూడా నటించబోతున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అవుతున్నారు.

ఈ విధంగా ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఎన్టీఆర్ సినిమాలకు థియేటర్లో మాత్రమే కాదు బుల్లితెరపై కూడా చాలా మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.ఎన్టీఆర్ టీవీల్లో టెలికాస్ట్ అయ్యే తన సినిమాలద్వారా సరికొత్త టీఆర్పీని సాధించి ఎవరికీ సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకున్నారు.
దాదాపు పది సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ బుల్లితెరపై క్రియేట్ చేసిన రికార్డును ఏ ఇతర హీరో కూడా చెరిపేయలేదని తెలుస్తోంది.

ఎన్టీఆర్ పూరి జగన్నాథ్( Puri Jagannath ) దర్శకత్వంలో నటించిన చిత్రం టెంపర్( Temper ).ఈ సినిమా థియేటర్లలో ఎంతో మంచి సక్సెస్ అందుకు బుల్లితెరపై సినిమా ప్రసారమయ్యే భారీ స్థాయిలో టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది.అప్పటివరకు ఏ సినిమాకు, ఏ హీరోకు రానిరీతిలో 29.9 రేటింగ్ సాధించి సంచలన రికార్డు నెలకొల్పింది.తర్వాత ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి కానీ ఏ సినిమా కూడా ఈ రేటింగ్ ను క్రాస్ చేయలేకపోయిందని చెప్పాలి.త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అలా వైకుంఠపురం సినిమా టెలివిజన్లో ప్రసారం అవుతూ 29.4 రేటింగ్ ను సాధించింది కానీ టెంపర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయింది.ఇటీవలే ప్రసారమైన అల్లు అర్జున్ మరో చిత్రం పుష్ప కూడా 25.4 రేటింగ్ ను సొంతం చేసుకొని టెంపర్ రికార్డులను బద్దలు కొట్టలేకపోయింది.ఇలా గత పది సంవత్సరాలుగా ఎన్టీఆర్ రికార్డును ఏ హీరో కూడా చెరిపేయలేదని చెప్పాలి.