ప్రముఖ నటుడు శరత్ కుమార్ ( Sarath kumar ) వారసురాలుగా నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalakshmi Sharath Kumar ) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.కెరియర్ మొదట్లో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె అనంతరం హీరోయిన్గా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు.
ఈ క్రమంలోనే నెగిటివ్ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈమెకు తరచూ ఇదే తరహా పాత్రలలో నటించే అవకాశాలు వస్తున్నాయి.వరలక్ష్మి శరత్ కుమార్ సైతం ఒక వైపు తెలుగు తమిళ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇలా వెండితెరపై మాత్రమే కాకుండా వరలక్ష్మి బుల్లితెరపై కూడా బిజీగా ఉన్నారు పలు కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ బిజీగా గడుపుతున్నారు.అయితే తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
జీ తమిళ్‌లో ప్రసారం అయ్యే డ్యాన్స్ షోకి( Dance Show ) జడ్జ్గా వ్యవహరించింది.ఈ రియాలిటీ షోలో.కెమీ అనే డ్యాన్స్ కంటెస్ట్ తన కుటుంబ సభ్యులచే నిరాశకు గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయింది.

ఇక ఇతరుల చేత లైంగిక వేధింపులకు కూడా గురైనట్టు కేమీ ఈ సందర్భంగా తన ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అయితే ఈమె మాటలకు వరలక్ష్మి కూడా స్పందిస్తూ చిన్నప్పుడు నేను కూడా ఐదారుగురి చేత లైంగిక వేధింపులకు గురి అయ్యానని తెలిపారు.చిన్నప్పుడు నా తల్లిదండ్రులు సినిమా పనులలో బిజీగా ఉండేవారు.దీంతో మమ్మల్ని సంరక్షకుల దగ్గర వదిలి వెళ్ళేవారు.
అలా చిన్నప్పుడు ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు నన్ను లైంగికంగా వేధించారు.మీ కథ నా కథ ఒకటే.