ధనుష్, నయనతార( Dhanush , Nayanthara ) కలిసి ఎక్కువ సినిమాల్లో నటించలేదు.వారు కలిసి హీరో హీరోయిన్లుగా యాక్ట్ చేసిన “యారది నీ మోహిని” సినిమా సూపర్ హిట్ అయింది.
వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా బాగా పండింది.మళ్లీ వీరిద్దరూ స్క్రీన్ పై కనబడితే చూడాలని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ధనుష్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుండగా, నయనతార హై బడ్జెట్ మూవీస్ చేస్తూ ఆకట్టుకుంటుంది.వీరిద్దరూ ఎవరికివారు వారి కెరీర్ లైఫ్ లో బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అప్పట్లో ఈ ముద్దుగుమ్మ, ధనుష్ కలసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఆ సమయంలో “నయనతార గురించి మీరేం చెప్తారు, సినిమా సెట్ లో ఎలా ఉంటుంది?” అని ఇంటర్వ్యూయర్ ధనుష్ ను అడిగింది.దానికి ధనుష్ బదులిస్తూ.“చాలా బద్ధకంగా ఉంటుంది, షార్ట్ టెంపర్ గర్ల్.చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కుమ్మి పడేస్తుంది.” అని అన్నాడు.దాంతో నయనతార జోక్యం చేసుకుంటూ “ఇంటర్వ్యూలో ఇవన్నీ చెప్పాలా?” అని అతడి పై కాస్త కోప్పడింది.దీంతో ఈ అమ్మడు చాలా షార్ట్ టెంపర్ అని ప్రేక్షకులకు తెలిసిపోయింది.

తర్వాత ధనుష్ ఇంకా మాట్లాడుతూ.“నయనతారకు భయంకరమైన షార్ట్ టెంపర్ ఉంది.కానీ బాగా హార్డ్ వర్క్ చేస్తుంది.ఎవరినైనా ఇష్టపడితే వారికోసం ఏదైనా చేస్తుంది.” అని ఆమెలోని మంచి క్వాలిటీస్ కూడా బయట పెట్టాడు.అయితే నయనతార సెట్ లో చాలా లేజీ గా, షార్ట్ టెంపర్( Short temper ) కలిగి ఉంటుందని అతడు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఒక వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
దీన్ని చూసి “మన లేడీ సూపర్ స్టార్‌ను పట్టుకొని అంత మాట అనేసాడు ఏంటీ? అని చాలామంది నోరెళ్ళ బెడుతున్నారు.