కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్ ( Thalapathy Vijay ) కు కోలీవుడ్ లో మాత్రమే కాదు మన తెలుగులో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయన సినిమాలు మన దగ్గర కూడా భారీ స్థాయిలోనే రిలీజ్ చేస్తుంటారు.
ఈ ఏడాది వారిసు సినిమాతో విజయం సాధించిన విజయ్ మరో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు.మొన్న సంక్రాంతి సీజన్ ను కబ్జా చేసిన విజయ్ ఈసారి దసరా బరిలో ‘‘లియో” సినిమాతో ఉండబోతున్నాడు.
ఈ సినిమా ఈ నెల గ్రాండ్ గా రిలీజ్ కానుంది.సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో ‘లియో‘ ( LEO ) సినిమా తెరకెక్కగా స్టార్ హీరోయిన్ త్రిష విజయ్ కు జోడీగా నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుని అంచనాలు పెంచేసింది.పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా ఆడియెన్స్ లో మంచి రెస్పాన్స్ అందుకోగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతుంది.లోకేష్ ముందు నుండి కూడా తన సినిమాల విషయంలో తనదైన శైలిలో సస్పెన్స్ మైంటైన్ చేస్తుంటాడు.
ఇక ఇప్పుడు కూడా లియో సినిమా విషయంలో చాలా సస్పెన్స్ లు దాచి ఉంచాడట.లియో దగ్గర పడే కొద్దీ ఈ ట్విస్టులను రివీల్ చేయనున్నాడు అని తెలుస్తుంది.
మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.