మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు.వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.
-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం-ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం-నవరాత్రుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం.శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు.
ఆయన జన్మ లోనే పర్యావరణ రహస్యం దాగుంది.నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణప్రతిష్ఠ చేసింది.
అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు.ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మారుతున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు.
సమాజంలో అనేక వర్గాల వారుంటారు.వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ.ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం.మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది.
హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.
మట్టి వినాయకుడు-అసలు రహస్యంవినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు.కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం.ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు.
మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు.అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు.
వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి.మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు.
అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి.నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు.
వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది.కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే.
ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు.అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.
పత్రిపూజ-రహస్యంగణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది.అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది.పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు.అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు.అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు.ఔషధపత్రాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి.
దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి.
ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు.ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.
నిమజ్జనం-అసలు రహస్యంనవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది.చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు.21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి.ఈ ఆల్కలాయిడ్స్ వల్ల ళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది.
ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.
.LATEST NEWS - TELUGU