సాధారణంగా మన హిందూ గ్రహ సంచారం ప్రకారం ఏ రెండు గ్రహాలు కలిసిన సరే సదరు రాశుల వారికి ధన ప్రాప్తి కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.అందులోనూ శుక్ర, బుధ గ్రహాలలో ఏ రెండు కలిసిన సరే కచ్చితంగా వారికి ధన ప్రయోజనం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు( Astrologers ) చెబుతున్నారు.2024 లో ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగను జరుపుకున్నారు.ఈ రోజు పండితులు చెప్పిన దాని ప్రకారం కొన్ని రాశుల వారికి కచ్చితంగా ధన ప్రాప్తి కలుగుతుంది.
మరి ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.వృషభ రాశి వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది.
ఎందుకంటే లాభ స్థానంలో బుధుడు శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి.

దాంతో వీరికి ఏ పని చేసినా సరే లక్ష్మీ కటాక్షం( Lakshmidevi ) బాగానే ఉంటుంది.దాంతో పాటు పెద్దగా ప్రయత్నం చేయకున్న సరే ప్రాప్తి కలుగుతుంది.వృత్తి, ఉద్యోగాలు చేసుకునే వారికి కూడా లాభాలు బాగానే ఉంటాయి.
మిధున రాశి వారికి కూడా రెండు శుభగ్రహాలు కలుస్తున్నాయి.కాబట్టి ఉద్యోగ, వ్యాపార రంగాలలో బాగా కలిసి వస్తుంది.
నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి.ఉద్యోగులు మంచి పొజిషన్ కి వస్తారు.
వ్యాపారపరంగా బాగానే కలిసి వస్తుంది.కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
కర్కాటక రాశి వారికి బుధ శుక్ర గ్రహాలు కలుస్తున్నాయి.

కాబట్టి ఆర్థికపరమైన లాభాలు పొందుతారు.మంచి జీతాలు తీసుకునే ఉద్యోగాలు పొందుతారు.అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా వస్తాయి.
వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ధనస్సు రాశి వారికి కూడా శుభ గ్రహాలు కలుస్తున్నాయి.
కాబట్టి ఉద్యోగాల్లో మంచి ఆర్థిక యోగం కలుగుతుంది.అంతేకాకుండా ఆకస్మిక ధన లాభం కూడా కలుగుతుంది.
ఏ పని చేసిన వీరికి బాగా కలిసి వస్తుంది.లాభదాయక మార్గాలు ఏర్పడతాయి.
కుంభ రాశి వారికి రెండు శుభ గ్రహాలు కలుస్తున్నాయి.కాబట్టి వీరికి ధన ప్రవాహం బాగానే ఉంటుంది.
వీరికి పెద్దగా పనులు చేయకుండా మాటల ద్వారానే డబ్బులు కలిసి వస్తాయి.అందుకే వీరికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.