ప్రతి ఏడాది మన జాతకంలో గ్రహాల స్థితిగతులు మారుతూ ఉంటాయి.ఇలా గ్రహాల స్థితి మారినప్పుడు మన రాష్ట్రంలో కూడా ఎన్నో మార్పులు జరిగి మన జీవితంలో కష్టసుఖాలు అనేటివి ఎదురవుతాయి.
ఇలా జీవితంలో ఎన్నో ఒడి దుడుకులు ఎదుర్కొంటూ ఉంటాము.ఇకపోతే ఈ ఏడాది కొన్ని రాశుల వారిపై కాలసర్ప దోష ప్రభావం అధికంగా ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కాల సర్పదోషం ఎంతో చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.మరి కాలసర్ప దోషం ఏ ఏ రాశుల వారిపై ఉంది వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటారు అనే విషయానికి వస్తే….
వృషభ రాశి:
2022 మొదటి మూడు నెలలు వృషభ రాశి వారికి ఎంతో కఠినతరంగా ఉన్నాయి.ఈ రాశి వారి తల్లి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది.
అలాగే మీకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులను దొంగిలించ బడతాయి.కనుక వృషభ రాశి వారు ఎంత జాగ్రత్త పడటం అవసరం.
కన్యారాశి:

ఈ రాశి వారికి పాక్షిక సర్ప యోగం కనిపిస్తుంది కనుక ఈ రాశి వారు వీలైనంతవరకు బయట ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిది.ఏప్రిల్ నెల వరకు ఈ రాశి వారు ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మద్యపానం సేవించే వారు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
వృశ్చిక రాశి:

ఈ ఏడాది ఈ రాశి వారిపై అధికార ఒత్తిడి ప్రభావం ఏర్పడుతుంది.మీకు తెలియకుండా మీపై ఇతరులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు.ఈ రాశి వారికి ఏప్రిల్ నెల వరకు ఏ మాత్రం సమయం అనుకూలంగా లేదు.
మీన రాశి:

ఈ రాశివారికి ఈ కాలానికి అనుగుణంగా దురదృష్టం వెంటాడుతూ వస్తోంది.ఈ రాశివారు ఊహించని విధంగా మీకు షాకింగ్ విషయాలను చెప్పేవారిని కలుస్తారు.అయితే వారి నుంచి మీరు విడిపోవడం కాస్త బాధగా అనిపించినప్పటికీ ఈ విషయాన్ని స్వాగతించాలని చెప్పాలి.