మొన్నటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యామిలీ లో వివాదం గురించి ఎక్కడ చూసినా కూడా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.మంచు మనోజ్( Manchu Manoj ) మంచు విష్ణు( Manchu Vishnu ) వద్ద పెద్ద గొడవలు జరిగాయి.
అవి కాస్త చిలికి చిలికి గాలి వానగా మారి మీడియా, పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా మరొకసారి జల్పల్లి లోని సినీ నటుడు మోహన్ బాబుకు( Mohan Babu ) సంబంధించిన మంచు టౌన్షిప్ వద్ద వివాదం నెలకొంది.
తాను లేని సమయంలో నార్సింగి లోని తన నివాసం వద్ద ఉన్న కార్లను విష్ణు దొంగలించాడని పేర్కొంటూ ఈ నెల 8న మంచు మనోజ్ నార్సింగి ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.తాజాగా బుధవారం ఉదయం 8.30 గంటలకు జల్పల్లి( Jalpally ) శివారులోని మంచు టౌన్షిప్ గేట్ ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.

సమాచారం అందుకున్న పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని మీడియాను లోనికి రానివ్వకుండా టౌన్షిప్ చుట్టూ కిలో మీటర్ సరిహద్దులో ఆంక్షలు విధించారు.పోలీసుల సూచనతో 11.45 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోతూ మనోజ్ మీడియా ఎదుట తన ఆవేదన వెలిబుచ్చారు.గత ఏడాది డిసెంబర్ 8వ తేదీ నుంచి మంచు టౌన్షిప్( Manchu Township ) లో ఆరంభమైన గొడవ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.అయితే జల్పల్లి లో మొదలైన ఈ గొడవ తిరుపతిలోని మోహన్‌బాబు వర్సిటీ వరకు తాకింది.
జల్పల్లి లో తాజాగా మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.మార్చి 27న తాను, తన భార్య ఇంట్లో ఉన్న సమయంలో బయటి వ్యక్తులు గుమిగూడుతున్న విషయమై పహాడీ షరీఫ్ ఇన్స్పెక్టర్ గురువారెడ్డికి ఫోన్ తో పాటు, 100 డయల్ కు కాల్ చేసి రక్షణ కల్పించాలని కోరాము.

అయినప్పటికీ నన్నే ఇంటి నుంచి బయటికి రావాలని పోలీసులు తెలిపారు.ఏప్రిల్ 2న నా కుమార్తె మొదటి పుట్టిన రోజు ఇక్కడే పరిమితంగా చేసుకుందామనుకున్నప్పటికీ, స్థానిక పరిస్థితుల దృష్ట్యా రాజస్థాన్ లోని జైపూర్ వెళ్లామని అన్నారు.అంతకుముందే నేను అక్కడ లేను, విష్ణును అక్కడ ఏమైనా చేసుకోమని మా అమ్మకు కూడా తెలిపాను.అమ్మపై ప్రమాణం.ఇది ఆస్తి కోసం కాదు.తిరుపతిలోని యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి తంతును ప్రశ్నించినందుకే ఈ పరిస్థితి ఎదురైంది.
డిసెంబర్ 8 నుంచి ఇప్పటి వరకు పహాడీ షరీఫ్ పోలీసులు ఒక్క ఛార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు.టౌన్షిప్ లో నాకు సంబంధించి మూడు పెట్ డాగ్ లు, పిల్లలకు సంబంధించి వస్తువులు ఉన్నాయి.
అవి తీసుకొని వెళ్తానని చెప్పినా లోనికి వెళ్లనీయడం లేదు.పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా నిర్లక్ష్యంగా వ్యహరించారు.
నేను రాజస్థాన్ కు వెళ్లిన వెంటనే విష్ణు తన కార్లను చోరీ చేశారని ఆరోపించారు.ఈ విషయమై పలుమార్లు పోలీసు ఉన్నత అధికారులకు కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు.
ఇంట్లో ఉన్న తన పాత జ్ఞాపకాలను సైతం తొలగించారు.రౌడీషిటర్ల ఆగడాలపై సీఐకి చెబితే అవునా పాపం కదా అంటున్నారు తప్పా చర్యలు తీసుకోవడం లేదు అంటూ మంచు మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.