ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుంటున్నారు.బన్నీ అట్లీ( Atlee ) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత( Samantha ) నటిస్తున్నారని సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా సమంత వ్యక్తిగత కారణాల వల్ల మంచి ప్రాజెక్ట్ లకు దూరంగా ఉంటున్న సమంతకు రీఎంట్రీలో సరైన ప్రాజెక్ట్ అవసరం అనే సంగతి తెలిసిందే.
అట్లి అల్లు అర్జున్ కాంబో మూవీ ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ తెరకెక్కనుండటం గమనార్హం.
వరుస విజయాలు సాధిస్తున్న బన్నీ తర్వాత సినిమాలతో సైతం భారీ విజయాలు అందుకోవాలని భావిస్తున్నారు.

అల్లు అర్జున్ పారితోషికం సైతం 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.అయితే బన్నీ సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు సైతం భారీ స్థాయిలో ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు.అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
బన్నీ తన సినిమాల లుక్స్ విషయంలో కేర్ తీసుకుంటున్నారు.

సమంత నిజంగానే ఈ సినిమాలో ఎంపికైతే మాత్రం అభిమానుల ఆనందానికి వధులు ఉండవని చెప్పవచ్చు.సమంత రెమ్యునరేషన్ సైతం ఒకింత పరిమితంగానే ఉంది.సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు.
సమంత కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాలి.బన్నీ సమంత కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.