కోపం ఎన్నో జీవితాలను నాశనం చేయడమే కాదు, ఒక్కోసారి ప్రాణాలను కూడా హరించేస్తుంది.అందుకే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని.
అప్పుడే మనసు, జీవితం రెండూ ప్రశాంతంగా ఉంటాయని పెద్దలు చెబుతుంటారు.కానీ, నేటి ఆధునిక కాలంలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం ఎవరి తరం కావడం లేదు.
ఈ క్రమంలోనే బంధాలు, బంధుత్వాలకు దూరమవుతూ మానసికంగా కృంగిపోతున్నారు.అందుకే ప్రతి ఒక్కరు కోపాన్ని అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి.
మరి అందు కోసం ఏం చేయాలి ఎలాంటి టిప్స్ పాటించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక్కోసారి ఎదుట వారు మాట్లాడే మాటలకు తీవ్రంగా కోపం వస్తుంటుంది.
దాంతో వెంటనే వారిపై అరవడమో, కొట్టమో చేస్తుంటారు.చివరకు గొడవల వరకు వెళ్తారు.
అలా కాకుండా కోపం వచ్చిన వెంటనే మీరు పక్కకు వెళ్లిపోయి.దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం చేయండి.
ఇలా కొంత సేపు చేస్తే వెంటనే మీరు రిలాక్స్ అయిపోతారు.ఈ సమయంలో కోపం సరైనది కాదు అన్న భామన మీలో పుడుతుంది.
అలాగే కోపాన్ని తగ్గించడంలో మ్యూజిక్ ఓ బెస్ట్‌గా మెడిసిన్‌గా చెప్పుకోవచ్చు.అవును, మీకు తీవ్రంగా కోపం వచ్చినప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కాసేపు మంచి సాంగ్స్ వింటే కట్టలు తెంచుకునే మీ కోపం వెంటనే కనుమరుగైపోతుంది.
వాకింగ్ ద్వారా కూడా కోపాన్ని తగ్గించుకోవచ్చు.మీకు ఏ కారణం చేతైనా కోపం వచ్చినప్పుడు.మైండ్‌లో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా కాసేపు వాకింగ్ చేయండి.దాంతో ఈ సమయంలో కోపం సరైనది కాదు అన్న భామన మీలో పుడుతుంది.
కోపం వచ్చినప్పుడు మనసులో మిమ్మల్సి మీరే ప్రశ్నించుకోండి.కోపం తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది?, ఇప్పుడేమైందని కోపం తెచ్చుకోవాలి? అంతా సర్దుకుంటుందిలే, అసలు నేను ఎందుకు కోపం తెచ్చుకుంటున్నాను? ఇలాంటివి మనసులో మీరే మిమ్మల్నే ప్రశ్నించుకుంటే.కోపం ఇట్టే తగ్గిపోతుంది.ఇక మెడిటేషన్ చేస్తే కోపాన్ని అదుపు చేసుకోవడం ఈజీ అయిపోతుంది.కాబట్టి, ప్రతి రోజు కాసేపు మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోండి.