సాధారణంగా ఒక్కో సమయంలో మెడ అనేది డార్క్ గా( Dark Neck ) మారుతుంటుంది.ఎండల ప్రభావం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, ఒంట్లో అధిక వేడి తదితర కారణాల వల్ల మెడ అనేది నల్లగా మారి అందవిహీనంగా కనిపిస్తుంది.
మీరు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.నెక్ వైట్నింగ్ లో( Neck Whitening ) ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ పిండి( Wheat ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్,( Coffee Powder ) వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెవెన్ జ్యూస్, రెండు టేబుల్ స్పూన్లు పెరుగు మరియు సరిపడా వాటర్ వేసుకుని అన్నింటిని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై తడి వేళ్ళతో మెడను సున్నితంగా స్క్రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అనంతరం తడి లేకుండా మెడను తుడుచుకొని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ సింపుల్ హోమ్ రెమెడీని కనుక పాటించారంటే మూడు వారాల్లోనే మీరు గ్రేట్ రిజల్ట్ గమనిస్తారు.