లిఫ్ట్ సదుపాయం వచ్చాక చాలా మంది మెట్లు( Stairs ) ఎక్కడమే మానేశారు.కానీ, మెట్లు ఎక్కడం శరీరానికి మంచి వ్యాయామం.
మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ వ్యాయామం అద్భుతంగా సహాయపడుతుంది.అయితే రోజుకు ఎంతసేపు మెట్లు ఎక్కొచ్చో తెలుసుకుంటే ఆరోగ్యం పరంగా మరింత ప్రయోజనం పొందవచ్చు.
పైగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే జిమ్‌కి వెళ్లాల్సిన అవసరమే ఉండదు.
మెట్లు ఎక్కడం అనేది కార్డియో( Cardio ) వ్యాయామంగా పని చేస్తుంది.
ఇది హృదయ స్పందన వేగాన్ని పెంచి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.గుండె జబ్బులు, హై బీపీ, కొలెస్ట్రాల్ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది.
కాళ్లు, తొడలు, పిరుదుల కండరాలకు మెట్లు ఎక్కడం అనేది మంచి వ్యాయామం.నిత్యం మెట్లు ఎక్కడం ద్వారా కాలి కండరాలు బలంగా మారుతాయి.

మెట్లు ఎక్కడం లోడ్ బేరింగ్ వ్యాయామం కాబట్టి.ఎముకలు దృఢంగా అవుతాయి.ఆస్టియోపోరోసిస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.బరువు తగ్గాలని( Weight Loss ) భావించే వారు రోజూ మీ ఆఫీస్‌లో, అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ వాడటం మానేసి మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి.
మెట్లు ఎక్కడం ద్వారా చాలా కాలరీలు ఖర్చు చేయవచ్చు.ఒక నిమిషం మెట్లు ఎక్కితే సుమారు ఏడు నుంచి పది కాలరీలు ఖర్చవుతాయి.ఇది ఫ్యాట్ బర్నింగ్‌ను వేగవంతం చేసి శరీర బరువును అదుపులోకి తెస్తుంది.

అంతేకాకుండా మెట్లు ఎక్కడ వల్ల సీరటోనిన్, ఎండార్ఫిన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి, ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.తద్వారా డిప్రెషన్, ఆందోళన వంటివి తగ్గుముఖం పడతాయి.అయితే ఆరంభ స్థాయిలో రోజుకు ఐదు నుంచి పది నిమిషాల పాటు తక్కువ వేగంతో మెట్లు ఎక్కడం మొదలు పెట్టాలి.
మోకాళ్ళపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.మోస్తరు ఫిట్‌నెస్ ఉన్నవారు రోజుకు పదిహేను నుంచి ముప్పై నిమిషాలు వరకు మెట్లు ఎక్కవచ్చు.
ఒకేసారి కాకపోయినా విడదల వారీగా అంటే ఉదయం పదిహేను నిమిషాలు, సాయంత్రం పదిహేను నిమిషాలు మెట్లు ఎక్కారంటే మంచి ఫలితాలు పొందుతారు.మోకాళ్ళ సమస్యలున్న వారు మాత్రం వైద్యుల సలహా లేకుండా మెట్లు ఎక్కరాదు.