చాలా మంది అమ్మాయిలు తమ జుట్టు పొడుగ్గా, దృఢంగా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం హెయిర్( Hair ) ఆయిల్, షాంపూ, కండిషనర్ తదితర కేశ ఉత్పత్తులను ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసుకుని వాడుతుంటారు.
తోచిన హెయిర్ మాస్క్‌లు వేసుకుంటూ ఉంటారు.అయినా సరే రిజల్ట్ అంతంత మాత్రం గానే ఉంటుందా.
.? అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ను( Homemade Serum ) మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.ఈ సీరంతో సులభంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను మీ సొంత చేసుకోవచ్చు.అదే సమయంలో మరిన్ని హెయిర్ కేర్ బెనిఫిట్స్ ను పొందవచ్చు.
అందుకోసం ముందుగా ఒక కలబంద ఆకుని( Aloevera ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టేబుల్ స్పూన్ డ్రై రోజ్ మేరీ ఆకులు మరియు ఒక కప్పు ఉల్లి తొక్కలు వేసి చిన్న మంటపై దాదాపు పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
దాంతో మన సీరం అనేది ఆల్మోస్ట్ రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ లేదా క్లాత్ సహాయంతో సీరం ను ఫిల్టర్ చేసుకుని చల్లారబెట్టుకోవాలి.ఈ సీరంలో వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి.సీరం అప్లై చేసుకున్న రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
వారానికి ఒక్కసారి ఈ సీరంను తయారు చేసుకుని వాడడం అలవాటు చేసుకుంటే చాలా ప్రయోజనాలే పొందుతారు.

ముఖ్యంగా ఈ హోమ్ మేడ్ సీరం జుట్టు ఒత్తుగా పొడుగ్గా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.కుదుళ్ళను బలపరిచి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటుంది.అలాగే డ్రై హెయిర్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారికి కూడా ఈ సీరం ఉపయోగపడుతుంది.
ఈ సీరం జుట్టులో తేమను నిలుపుతుంది.పొడి జుట్టును రిపేర్ చేస్తుంది.
స్మూత్ అండ్ సిల్కీ హెయిర్ ను అందిస్తుంది.అంతేకాకుండా ఈ సీరంను వాడడం వల్ల హెయిర్ బ్రేకేజ్ సమస్య కూడా దూరం అవుతుంది.