టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో గ మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఒకరు ఈయన నటుడుగా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను దాదాపు తగ్గించారని చెప్పాలి.పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టిన పవన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్( Vakeel Saab ).ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే.

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా 2021 వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే నేటికి సరిగ్గా ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్( SS Thaman ) ఈ సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ సందర్భంగా తమన్ ఈ సినిమా గురించి పోస్ట్ చేస్తూ… వకీల్ సాబ్ సినిమాలో పనిచేయటం తనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు.ఈ సినిమా తన మ్యూజిక్ కెరియర్ కు చాలా ఉపయోగపడిందని ఇలాంటి ఒక గొప్ప సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ తమన్ ఈ సినిమా గురించి చేస్తున్నటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ముగ్గురు ఆడపిల్లలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తే.వారికి ఒక లాయర్ గా సత్యదేవ్ ఎలా న్యాయం చేశాడు అనే కోణంలో తెరకెక్కించారు.బలహీన పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లల తరఫున ఇందులో సత్యదేవ్ పాత్రలో పవన్ చేసిన న్యాయ పోరాటం అందరిని ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా బాలీవుడ్ చిత్రం పింక్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.