పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అస్సలు ఆలస్యం చేయకండి..

మన శరీరంలో రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ శరీరానికి చాలా హాని తలపెడుతుంది.అలాగే రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి రక్త ప్రసరణకు ఆటంకం కూడా కలుగుతుంది.

 Do These Symptoms Appear In The Feet? But Don't Delay At All., Leg Cramps , Heal-TeluguStop.com

దీని వల్ల గుండెతో పాటు శరీరంలో ఉన్నా మిగతా భాగాలకు కూడా రక్తం సరఫరా చేయడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తుతుంది.దీని వల్ల అధిక రక్తపోటు, హార్ట్ ఎటాక్( Heart attack ), మధుమేహం లాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అందుకే చెడు కొలెస్ట్రాల్ లక్షణాలను సకాలంలో గుర్తించి దానికి కావలసిన చికిత్సను తీసుకోవడం చాలా అవసరం.వాస్తవానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు మన పాదాలలో కొన్ని రకాల సంకేతాలు హెచ్చరిస్తాయి.

మరి ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు పాదాలలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతాయి.అయితే ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం చాలా మంచిది.

రక్తంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ) పరిమాణం పెరిగినప్పుడు పాదాలకు రక్తప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది.దీని వల్ల తరచుగా పాదాలు తిమ్మిరి( Leg cramps ) పట్టినట్లు అనిపిస్తోంది.రక్తంలో కొలెస్ట్రాల్ వల్ల ధమనుల్లో అడ్డు ఏర్పడుతుంది.అలాగే పాదాలలో రక్త సరఫరా కూడా సరిగ్గా జరగదు.దీని వల్ల పాదాలు చల్లగా అయిపోతాయి.రక్తంలో కొలెస్ట్రాల్ అడ్డుపడటం వలన రక్త ప్రసరణ సరిగా జరగకపోవడంతో పాదాలకు ఆక్సిజన్ సరఫరా కూడా సరిగ్గా చేరదు.

ఇలాంటి పరిస్థితుల్లో పాదాలలో తీవ్రమైన నొప్పి తలెత్తుతుంది.మన పాదాల గోళ్ళ రంగు మారిపోతుంది.సాధారణంగా మన గోళ్ళు గులాబీ రంగులో ఉంటాయి.కానీ అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు రక్తప్రసరణ సరిగ్గా జరగకపోవడం వలన గోర్లు పసుపు రంగులోకి మారుతాయి.అలాగే గోర్లలో చారలు కనిపిస్తాయి.ఇలా ఈ లక్షణాలన్నీ మీకు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube