అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్( Janhvi Kapoor ) బాలీవుడ్ లో గత మూడు నాలుగు సంవత్సరాలుగా వరుసగా సినిమాలు మరియు వెబ్ సిరీస్ చేసిన విషయం తెలిసిందే.ఆయన ఇప్పటి వరకు ఆయనకు కమర్షియల్ సక్సెస్ దక్కలేదు.
ఒక్క సక్సెస్ దక్కకుండా కూడా ఆమె కు పారితోషికం ఏకంగా ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.జాన్వీ కపూర్ సక్సెస్ కాకుండా ఆమె అందాల ఆర బోతతో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
అందుకే ఎక్కువ పారితోషికం ఇస్తున్నామంటూ నిర్మాతలు చెబుతున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ కి జోడిగా కొరటాల శివ దర్శకత్వం లో ఈమె నటిస్తున్న విషయం తెలిసిందే.
అందుకు గాను ఏకంగా ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్ లో సక్సెస్ లేని ఈ అమ్మడి ని టాలీవుడ్ లో అంత రెమ్యూనరేషన్ ఇచ్చి నటింపజేయడం ఏంటో అంటూ అంతా కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈ చిత్రంతో మొదటి విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతుంది అంటూ ఆమె అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా నమ్మకంతో ఉన్నారు.శ్రీదేవి కూతురు అవడం వల్ల మరియు అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం లేకుండా వ్యవహరించడం వల్ల ఈ ముద్దుగుమ్మకి మంచి పాపులారిటీ లభించింది.
అందుకే 5 కోట్ల రూపాయల పారితోషికం అనేది ఈమెకు ఇచ్చిన ఫలితమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం చేస్తున్నారు.

మొత్తానికి ముద్దుగుమ్మ యొక్క అందాల ఆరబోతకు మరియు నటనకి ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం మంచిదే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సక్సెస్ దక్కక ముందే ఐదు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమా సూపర్ హిట్ అయితే ఒకే సారి రెండు మూడు కోట్ల రూపాయలను పెంచే అవకాశాలు లేక పోలేదు అంటూ కొందరు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మొత్తానికి జాన్వీ కపూర్ కి అంత ఇవ్వడం అవసరమా అంటూ కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం పరవాలేదు ఇవ్వచ్చు అంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.