అల్లు అర్జున్ ప్లానింగ్ వెనుక స్టార్ డైరెక్టర్ జక్కన్న.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

టాలీవుడ్ హీర అల్లు అర్జున్( Allu Arjun ) పుష్ప మూవీ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.ఈ సినిమా అల్లు అర్జున్ క్రేజ్ ని భారీగా పెంచడంతోపాటు మరింత గుర్తింపుని తెచ్చిపెట్టింది.

 Rajamouli Behind Allu Arjun Plan Earlier Pushpa 2 Now Atlee And Next Trivikram D-TeluguStop.com

ఈ సినిమాతో అల్లు అర్జున్ తానేంటో నిరూపించుకున్నారు.ముఖ్యంగా పుష్ప 2( Pushpa 2 ) తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.ఈ చిత్రం ఏకంగా రూ.1800కోట్లు వసూలు చేసింది.జక్కన్న దర్శకత్వం వహించిన బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్‌ చేసింది.రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో కాకుండానే బన్నీ ఈ రేర్‌ ఫీట్‌ ని అందుకున్నారు.

క్రియేటివ్‌ జీనియస్‌ సుకుమార్‌ తో కలిసి ఈ సంచలనాలకు తెరలేపారు.అయితే ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు అల్లు అర్జున్‌.

Telugu Allu Aravind, Allu Arjun, Alluarjun, Atlee, Pushpa, Pushpa Rule, Rajamoul

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్‌ అట్లీ( Atlee ) దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.సైన్స్ ఫిక్షన్‌ గా, ఇండియాలో ఇప్పటి వరకు రాని జోనర్‌ లో ఈ మూవీ చేయబోతున్నారట.అయితే ఇటీవల అట్లీ సినిమాని ప్రకటిస్తూ ఒక వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇందులో హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్ స్టూడియోతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.టైమ్‌ ట్రావెల్‌, సూపర్‌ హీరోలను తలపించేలా ఈ మూవీ ఉంటుందనే విషయం తెలుస్తోంది.దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్‌ తో ఈ మూవీని ప్లాన్‌ చేస్తున్నారట.

ఈ మూవీని సన్‌ పిక్చర్స్ సంస్థ నిర్మించబోతోందట.హైలీ టెక్నికల్‌ వ్యాల్యూస్‌ తో ఈ సినిమాని రూపొందిచబోతున్నారని తెలుస్తోంది.

Telugu Allu Aravind, Allu Arjun, Alluarjun, Atlee, Pushpa, Pushpa Rule, Rajamoul

ఈ చిత్రంతో రెండు వేల కోట్లు కాదు, దానికి మించి టార్గెట్‌ చేసినట్టు సమాచారం.దీంతో పాటు నెక్ట్స్ కూడా భారీ మూవీ ప్లాన్‌ చేస్తున్నారట.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్( Trivikram Srinivas ) తో సినిమా చేయబోతున్నారట బన్నీ.ఈ చిత్రం కూడా మైథలాజికల్‌ జోనర్‌ లో ఉండబోతోందట.ఇది కూడా భారీ బడ్జెట్‌ మూవీ అని తెలుస్తోంది.కాగా అల్లు అర్జున్‌ ఈ మూవీతో కూడా ఇండియన్‌ సినిమాని షేక్‌ చేయడమే కాదు, ఇంటర్నేషనల్‌ మూవీ స్టాండర్డ్స్ లో హాలీవుడ్‌ సినిమాలకు పోటీ ఇవ్వబోతున్నారట.

దీంతోపాటు సందీప్‌ రెడ్డి వంగాతోనూ( Sandeep Reddy Vanga ) ఒక మూవీ చేయబోతున్నారు బన్నీ.

Telugu Allu Aravind, Allu Arjun, Alluarjun, Atlee, Pushpa, Pushpa Rule, Rajamoul

అయితే ఈ ఇవన్నీ ఒక ప్లాన్‌ ప్రకారం చేయబోతున్నారట.దీని వెనకాల రాజమౌళి ఉన్నారట.మరి ఆయన పాత్ర ఏంటనేది చూస్తే, ఇది బన్నీలో ఉన్న కసి అని తెలుస్తోంది.

మగధీర సమయంలో నిర్మాత అల్లు అరవింద్‌ కి, రాజమౌళికి చిన్నపాటి డిఫరెన్సెస్‌ వచ్చాయి.ఆ సమయంలో రాజమౌళి హర్ట్ అయ్యారు.ఆ తర్వాత బన్నీతో సినిమా చేయడానికి సుముఖత చూపించలేదు.దీంతో అప్పుడే బన్నీ డిసైడ్‌ అయ్యాడట.

రాజమౌళితో సినిమా చేయకుండానే ఆయన రికార్డులు బ్రేక్‌ చేయాలని, తానేంటో నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నారట.ఆ ప్లాన్‌ లో భాగంగానే ఆయన ముందుకు వెళ్తున్నట్టు, ఇలా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది.

రాజమౌళితో తాను కూడా సినిమాలు చేయకూడదని డిసైడ్‌ అయ్యాడట.సోలోగానే తాను అంతర్జాతీయ నటుడిగా ఎదగాలని భావిస్తున్నారట.

ఇదంతా ఒక పదేళ్ల క్రితం నుంచి జరుగుతున్న ప్లానే అని తెలుస్తోంది.ఆ ప్లాన్‌ ప్రకారమే సినిమాలు చేస్తున్నారు బన్నీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube