పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందాలంటే.. ఈ చిట్కాలను పాటించండి..!

చాలామంది ఆడవారు బహిష్టు సమయంలో వెన్నునొప్పి, కడుపునొప్పి, కాళ్ల తిమ్మిరితో బాధపడుతూ ఉంటారు.కనీసం ఐదు రోజుల పాటు ఎంతో బలహీనంగా మారిపోతారు.

 Drinks To Help Reduce Period Pain,periods Pain, Spicy Ginger Tea, Masala Tea,chr-TeluguStop.com

కాబట్టి మీ శరీరానికి ఏదైనా ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం.ఈ సమయంలో ఏం తాగాలి ఏం తినాలని గందరగోళం చాలా మందిలో ఉంటుంది.

ఋతు నొప్పిని తగ్గించే ఈ పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ పానీయాలు తాగడం వల్ల ఋతు నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చామంతి పుల తో తయారుచేసిన టీ మంచి సువాసనతో పాటు పూల రుచిని కలిగి ఉంటుంది.చామంతి పూలు( Chrysanthemum tea ) అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.టీ బ్రూ హిప్యూరేట్, గ్లైసెమిక్ వంటి సమ్మేళనాలతో నిండి ఉంటుంది.ఇది కండరాల నొప్పులను( Muscle Pain ) తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.అలాగే బహిష్టు సమయంలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఒక కప్పు స్పైసి అల్లం టీ( Spicy Ginger Tea )తో రుతుచక్రంలో వచ్చే నొప్పిని దూరం చేసుకోవచ్చు.అల్లం ఒక సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది.బహిష్టు సమయంలో త్రాగడానికి ఇది అనువైన పానీయమని కొంతమంది పెద్దవారు చెబుతూ ఉంటారు.

మరిగే నీటిలో కొన్ని సన్నని అల్లం ముక్కలను వేసి ఐదు నిమిషాలు పాటు మరిగించి ఆ తర్వాత వేడివేడిగా తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.దాల్చిన చెక్క అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.

దీనితో ఎంతో రుచికరమైన మసాలా టీ( Masala Tea )ని తయారు చేయవచ్చు.ఇది రుతుస్రావం సమయంలో నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

నీటిలో ఒక దాల్చిన చెక్క, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి మిశ్రమాన్ని మద్యస్థంలో వేడి చేస్తూ మంచి వాసన వచ్చే వరకు మరిగించాలి.ఆ తర్వాత నీటిని వడగట్టి అందులో తేనె కలిపి తాగాలి.

ఇది మీ శరీరానికి ఎంతో మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube