మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అందరూ చెప్తూ ఉంటారు కానీ కొందరు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు అలాంటి వాళ్లలో సినిమా ఇండస్ట్రీకి చెందిన చాలామంది ఒకరిని చూస్తే ఇంకొకరిల మనకు కనిపిస్తూ ఉంటారు వాళ్లలో కొందరిని ఇప్పుడు మనం చూద్దాం…
సీనియర్ ఎన్టీఆర్ – సత్యనారాయణ
తెలుగు చలన చిత్ర సీమలో తనకంటూ ఓ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారు అని చెప్పాలి.అలాంటి నటుడు పోషించని పాత్ర లేదు.ఇదిలా ఉంటే విలన్ పాత్రలో నటించి అందరి మన్ననలను పొందిన సత్యనారాయణగారు అచ్చం ఎన్టీఆర్ లా ఉంటారు అని అప్పట్లో అందరూ అనేవారు కొన్ని సినిమాల్లో సత్యనారాయణగారు ఎన్టీఆర్ కి డూప్ గా కూడా నటించాను అని చాలాసార్లు తనే స్వయంగా చెప్పాడు వారిద్దరి ఆకారం చూడడానికి ఒకేలా ఉంటుంది.
రజినీకాంత్ – బాలాజీ
సూపర్ స్టార్ రజనీకాంత్ తనదైన నటనతో తెలుగు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు.తమిళంలో తనకు ఎంత క్రేజ్ అయితే ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక హీరో రజనీకాంత్.రజనీకాంత్ సినిమాలు నరసింహ, భాష,శివాజీ, రోబో లాంటి సినిమాలు ఇక్కడ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
అలాంటి రజినీకాంత్ గారిలా ఉండే నటుడు ఒకరు ఉన్నారు ఆయనే బాలాజీ ఈ పేరు చెప్తే చాలా మందికి తెలియక పోవచ్చు, కానీ బుల్లితెరపై అనేక సీరియల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్నాడు బాలాజీ.రజినీకాంత్ యంగ్ ఏజ్ లో ఎలా ఉండేవాడు బాలాజీ అలానే ఉంటాడు రజినీకాంత్ స్టైల్ ని ఇప్పటికీ బాలాజీ ఫాలో అవుతూ ఉంటాడు.
వాళ్లని చూసిన ప్రతి ఒక్కరు అన్నదమ్ముల్లా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు.బాలాజీ రజనీకాంత్ స్టైల్ ని ఇమిటేట్ చేస్తాడు అని తెలిసిన రజనీకాంత్ కూడా బాలాజీ తో తనలా నటించమని చెప్పి బాలాజీ స్టైల్ చూసి అచ్చం నాలాగే చేస్తున్నావని ప్రశంసలు కూడా అందించాడని స్వయంగా బాలాజీ చెప్పాడు.
వెంకటేష్ – కార్తీ
తెలుగు సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు సాధించిన హీరో వెంకటేష్.తను నటించిన ప్రతి సినిమాలో తనదైన మార్క్ నటనతో ప్రశంసలు అందుకుంటూ ఉంటాడు.అలాంటి వెంకటేష్ కెరియర్ లో బొబ్బిలి రాజా, చంటి, గణేష్, కలిసుందాం రా, రాజా,లక్ష్మీ ,తులసి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.తమిళ ఇండస్ట్రీలో సూర్య తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీ తెలుగులో కూడా యుగానికొక్కడు సినిమాతో పరిచయమై ఆవారా సినిమాతో మంచి గుర్తింపును సాధించార.
నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో తన నటనతో అందరిని ఆకర్షించాడు.అయితే కొన్ని యాంగిల్స్ లో చూస్తే వెంకటేష్ కార్తీ ఇద్దరూ ఒకేలా ఉంటారని చాలామంది అంటుంటారు.ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు అన్నదమ్ములా కనిపిస్తారు అని చాలామంది అంటుంటారు.
రచ్చరవి – నూతన్ నాయుడు
జబర్దస్త్ షోలో తన కామెడీతో మంచి గుర్తింపు సాధించిన ఆర్టిస్ట్ రచ్చరవి.జబర్దస్త్ కాకుండా చాలా సినిమాల్లో నటిస్తూ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు రచ్చరవి.ఈమధ్య హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గద్దలకొండ గణేష్ సినిమా లో మంచి క్యారెక్టర్ పోషించి ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు.
అయితే బిగ్ బాస్ లో నూతన నాయుడు అనే వ్యక్తిని చూసిన చాలామంది ఈయన అచ్చం రచ్చరవి ల ఉన్నాడే అని వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.నిజానికి రచ్చ రవి నూతన్ నాయుడు ఇద్దరు కూడా చూడ్డానికి ఒకేలా ఉంటారు కొందరైతే వీళ్లిద్దరు ట్విన్స్ అయ్యుండొచ్చు అని అనుకున్నారు.