టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారిలో ప్రభాస్(Prabhas) ఎన్టీఆర్ (NTR)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో కూడా హీరోలుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ ఇద్దరు హీరోల సినిమాలు వస్తే అభిమానులకు పండుగ అని చెప్పాలి.అలాంటిది ఈ ఇద్దరు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపించబోతున్నారంటే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.

ప్రస్తుతం ఎంతోమంది హీరోలు మల్టీ స్టారర్ (Multi Starer)సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రభాస్ హీరోలుగా ఓ మల్టీ స్టార్ సినిమా రాబోతుంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.ఇటీవల తమిళంలో అమరన్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డైరెక్టర్ రాజ్ కుమార్(Raj Kumar) పెరియస్వామి.ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ప్యాన్ ఇండియా మూవీకి ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓ స్టోరీ లైన్ ప్రభాస్ ఎన్టీఆర్ కి చెప్పడంతో వీరిద్దరూ చాలా ఎక్సైట్ గా ఫీల్ అయ్యారట .అయితే ఇంకా ఈ సినిమా కోసం ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా స్టోరీ లైన్ మాత్రం వీరికి అద్భుతంగా నచ్చిందని తెలుస్తోంది.ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రభాస్ ఇద్దరు కూడా వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే తమ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సినిమాకు ఓకే చెప్పలేదని, మరో ఏడాది వరకు ఈ సినిమా గురించి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చే పరిస్థితులలో లేరని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాకు వీరిద్దరూ ఒకే చెబితే అభిమానుల ఆనందానికి ఏమాత్రం అవధులు ఉండవని చెప్పాలి.