డిప్రెషన్ లో ఉన్నారా? అయితే మరో 10 సంవత్సరాల్లో మీకు వృధ్యాప్యం రావడం పక్కా..

సాధారణంగా ఏ మనిషికైనా డిప్రెషన్( Depression ) అనేది వారిని ఎక్కువగా కుంగ తీయడానికి కారణం అవుతుంది.డిప్రెషన్ కి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.

 Are You Depressed? But In Another 10 Years You Will Surely Old Age ,depression ,-TeluguStop.com

కానీ డిప్రెషన్ వల్ల మనిషి శారీరక అలాగే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.అలాగే మరీ ముఖ్యంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళ వయసు చాలా త్వరగా పెరిగి వృద్ధాప్యం వస్తుందాని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డిప్రెషన్ వల్ల శరీరంలో ఒత్తిడిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.అధిక రక్తపోటు అలాగే డయాబెటిస్ పెరగడం లాంటి ప్రమాదాలకు దారితీస్తుంది.

అందుకే డిప్రెషన్ కు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.అంతేకాకుండా డిప్రెషన్ మెదడు అకాల వృద్ధాప్యానికి కారణం అవుతుంది అని గతంలో శాస్త్రవేత్తలు, పరిశోధకులు తెలిపారు.సైకాలజికల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యాయంలో మెదడు పనితీరు క్షీణతపై డిప్రెషన్ ప్రభావం గురించి ఎన్నో విషయాలు తెలుగులోకి వచ్చాయి.అదేవిధంగా యూకే లోని సక్సెస్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 34 అధ్యాయనాలు సమీక్షించారు.

అయితే ప్రధాన దృష్టి, నిరాశ లేదా ఆందోళన( Anxiety ) కారణంగా కాలక్రమేణా మెదడు పనితీరులో క్షీణతకు మధ్య సంబంధం ఉందని వారు తెలిపారు.అంతేకాకుండా పెద్దలలో జ్ఞాపక శక్తి సామర్థ్యం( Memory ), నిర్ణయం తీసుకోవడం మొదలైన వాటితో సహా మెదడు పనితీరులో లోటును పరిశోధకులు కనుగొన్నారు.ఈ విశ్వవిద్యాలయానికి చెందిన దర్యా గిసినా మాట్లాడుతూ పని, ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా చాలామందిలో రాబోయే 30 సంవత్సరాలలో మెదడు పనితీరు తగ్గడం జరుగుతుందని ఆయన తెలిపారు.ఆలాగే డిమెన్షియా ఉన్న వారి సంఖ్య పెరుగుతుందన్న అంచనా గురించి ఆయన తెలిపారు.

అయితే డిప్రెషన్ కు దూరంగా ఉండాలంటే ఎక్కువగా సన్నిహితులతో అలాగే ఆప్తులతోనూ తమ బాధలను పంచుకోవాలని వాళ్ళు తెలిపారు.అలా చేస్తే ఒత్తిడికి గురి అవ్వమని నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా ఒత్తిడికి గురి చేసే పనులు కూడా చేయకూడదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube