సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎవరి టాలెంట్ వారు చూపించుకొనే పరిస్థితి వచ్చింది.మరీ ముఖ్యంగా కొంతమంది ఔత్సాహికులు ఏవేవో ప్రయోగాలు చేస్తూ, ఆ వీడియోలన్నింటినీ నెట్టింట్లోకి వదలడంతో విపరీతమైన వ్యూస్ సంపాదిస్తున్నారు.
అయితే అటువంటి వీడియోలు కొన్నిటిని చూసినప్పుడు నవ్వు వస్తే.మరికొన్ని వీడియోలను చూసిప్పుడు ఒకింత ఆశ్చర్యం కలగక మానదు.తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్లింట చక్కర్లు కొట్టడంతో జనాలు గలగలా నవ్వుతూ, కిందబడి గిలగిలా కొట్టుకుంటున్నారు.అవును… ఓ వ్యక్తి గిటార్( Guitar ) ప్లే చేయడం చూసి అంతా షాక్ అవుతున్నారు మరి! ఈ వీడియో చూసిన వారంతా.”అసలైన లైవ్ మ్యూజిక్ అంటే ఇదేనేమో”.అంటూ కామెంట్లు చేస్తుండడం కొసమెరుపు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సదరు వీడియోని( Viral Video ) గమనిస్తే… ఓ వ్యక్తి గిటార్ వాయిస్తూ వీడియో తీసుకుంటున్నాడు.అయితే ఇక్కడ అతను వాయిస్తున్నది అసలైన గిటార్ కాదండోయ్… గిటార్ ఆకారంలో ఉన్న ఇనుప వస్తువు అన్నమాట.అంటే ఓ ఇనుప రేకును గిటార్ ఆకారంలో కట్ చేసిన సదరు యువకుడు.దానిపై వెల్డింగ్ హ్యాండిల్‌తో నిప్పులు పుట్టిస్తూ( Fire ) గిటార్ వాయిస్తున్నట్లు జస్ట్ నటించాడంతే! దూరం నుంచి చూసేవారికి.
అతను గిటార్ వాయిస్తుంటే అందులో నుంచి నిప్పులు వస్తున్నట్లు ఇక్కడ కనిపిస్తోంది.ఇలా ఇతను ఇనుప గిటార్‌తో నిప్పులు పుట్టిస్తూ లైవ్ మ్యూజిక్ ఇస్తున్నాడన్నమాట.
కాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సదరు వీడియో పైన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.”ఇది కదా అసలు సిసలైన లైవ్ మ్యూజిక్ అంటే”.అని కొందరు కామెంట్ చేస్తే… ”ఎలా వస్తాయన్న ఇటువంటి ఐడియాలు”.అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.దాంతో సదరు వీడియో ప్రస్తుతం 15 వేలకు పైగా లైక్‌లు, 3.45 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.