మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మెగాస్టార్ తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ ఎన్నో సినిమాలలో నటించి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు రామ్ చరణ్.మరోవైపు ఉపాసన మెగా కోడలుగా బాధ్యతలు నిర్వహిస్తూనే అపోలో హాస్పిటల్స్ చైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ఈ దంపతులకు పెళ్లయిన దాదాపు పది ఏళ్ల తర్వాత సంతానం కలిగిన విషయం తెలిసిందే.

ఈ పాపకు క్లీన్ కారా అనే పేరును కూడా నామకరణం చేసిన విషయం తెలిసిందే.ఈ పాప పుట్టి చాలా రోజులు నడుస్తున్న ఇంతవరకు పాప ఫేస్ రివిల్ చేయకుండా ఊరిస్తూనే ఉన్నారు.అయితే ఈ విషయంలో రాంచరణ్ ఒకసారి స్పందిస్తూ తన కుమార్తెకు ప్రైవసి చాలా ముఖ్యం అని, అందుకే తన ఫేస్ రివిల్ చేయడం లేదు.
ఎప్పుడైతే నా కూతురు నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడు ఫేస్ రివిల్ చేస్తాను అని తెలిపారు రామ్ చరణ్.రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనలు తమ కుమార్తె క్లిన్ కారా ఫేస్ ని రివీల్ చెయ్యకుండా ఆమె కు సంబందించిన ప్రతి ఒక్క విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా మెగా మనవరాలు క్లిన్ కారా మెగాస్టార్ సతీమణి సురేఖ, రామ్ చరణ్ సతీమణి ఉపాసనలతో కలిసి ఉగాది పూజలో మెరిసింది.చిట్టిపొట్టి ఫ్రాక్ లో రామ్ చరణ్ కూతురు క్లిన్ కారా నానమ్మ తో కలిసి ఉగాది పూజ చేసిన పిక్స్ ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎప్పటిలాగే క్లిన్ కారా ఫేస్ ని మాత్రం చూపించకుండా దాచేసారు.కానీ ఒకవైపు మాత్రం ఫేస్ కనిపిస్తోంది.ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్లీన్ కారా రామ్ చరణ్ ని ఎప్పుడు నాన్న అని పిలుస్తుందో నీ ఫేస్ ని ఎప్పుడు రివీల్ చేస్తారో అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.