1.Weta ఆధ్వర్యంలో ఘనంగా మదర్స్ డే వేడుకలు
అంతర్జాతీయ మదర్స్ డే వేడుకలను అమెరికాలోని ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది.ఉమెన్ ఎంపవర్మేంట్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు జాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14 న యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర సెంటర్ మదర్స్ డే ను ఘనంగా నిర్వహించారు.
2.న్యూజిలాండ్ ప్రధానికి కోవిడ్
న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డ్నార్ కి కరోనా పాజిటివ్ సోకింది.
3.గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘం సభ్యులకు సేవా అవార్డులు
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సంఘ సభ్యులను ప్రముఖ నటుడు జగపతిబాబు అవార్డుల తో సత్కరించారు.
4.ఇంగ్లాండ్ లో మంకీ పాక్స్ కేసులు
ఇంగ్లాండ్లో తాజాగా మరో ఇద్దరికి మంకీ ఫాక్స్ సోకింది.బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ విషయాన్ని బయటపెట్టింది.
5.దక్షిణాఫ్రికా లో ఘనంగా టిడిపి మహానాడు వేడుకలు
ఎన్.ఆర్.ఐ టీడీపీ ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా లో మే 14 న మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించింది.ఈ కార్యక్రమానికి టిడిపి మాజీ మంత్రి జవహర్, టీడీపీ సెక్రెటరీ గౌతు శిరీష పాల్గొన్నారు.
6.దుబాయ్ లో మూడు రోజుల పాటు నో పార్కింగ్ ఫీజు
దివంగత షేక్ ఖలీఫా బిన్ జాయోధ్ ఆల్ సహ్యాన్ సంతాప దినాల్లో భాగంగా మూడు రోజుల పాటు పార్కింగ్ ఫీజు ను రద్దు చేసినట్లు దుబాయ్ అధికారులు తెలిపారు.
7.నాటో లో చేరనున్న మరో దేశం
నాటో లో చేరనున్నట్లు ఫిన్లాండ్ దేశం ప్రకటించింది.
8.ప్లే స్టోర్ నుంచి 9 లక్షల యాప్ ల తొలగింపు
ప్లే స్టోర్ నుంచి 9 లక్షల యాప్ లపై చర్యలు చేపట్టేందుకు గూగుల్ సిద్ధం అయ్యింది.యుజర్స్ డేటా కోసం ఉగ్రవాదులు ఈ యాప్ లను ఉపయోగించుకుంటున్నట్టు గూగుల్ పేర్కొంది.
9.రష్యా వార్నింగ్
తమ మాట వినకుండా నాటో లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుంది అనే ఏకైక కారణం తో ఉక్రెయిన్ పై యుద్దాన్ని ప్రకటించింది రష్యా.
తాజాగా ఫిన్ లాండ్, స్వీడన్ దేశాలు నాటో లో చేరబోతున్నట్టు ప్రకటించడం పై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనిపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి అని హెచ్చరించింది.