టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లుగా మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ బోలెడు మంది ఉన్నారని చెప్పాలి కానీ మేల్ యాంకర్ల గురించి మాట్లాడాల్సి వస్తే రవి ప్రదీప్ (Pradeep)వంటి వారు మాత్రమే గుర్తుకొస్తారు.
ఇక రవి ప్రస్తుతం పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.మరోవైపు ప్రదీప్ సైతం కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఈయన పలు షోలను నిర్మిస్తూ నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇక ప్రదీప్ హీరోగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే .

కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించిన ప్రదీప్ అనంతరం హీరోగా మారారు.ఈయన హీరోగా 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది ఈ సినిమా విడుదలయ్యి కూడా దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది.
ఇప్పటివరుకు రెండో సినిమా విడుదల కాలేదు అయితే తన రెండో సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (Akkada Ammayi Ikkada Abbayi)త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో సుమ(Suma) షోలో ప్రదీప్ సందడి చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా తన రెండో సినిమా ఎన్ని రోజుల తర్వాత రావడానికి గల కారణం ఏంటి ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అనే విషయాల గురించి ప్రశ్నించారు.నిజానికి 30 రోజులలో ప్రేమించడం ఎలా సినిమా షూటింగ్ సమయంలోనే తనకు గాయం కావడంతో సర్జరీ చేశారని ప్రదీప్ తెలిపారు.ఇలా సర్జరీ(Surgery) కారణంగా విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పటికీ తాను గాయం పూర్తి కాకముందే పలు షోలలో పాల్గొనను తద్వారా ఆగాయం మరింత పెద్దది అయ్యి మళ్లీ సర్జరీ చేయాల్సి వచ్చిందని, అందుకే రెండో సినిమాకు ఇంత గ్యాప్ వచ్చిందని ప్రదీప్ తెలిపారు.
ప్రస్తుతం పూర్తిగా రికవరీ అయ్యాను అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.