టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar)ఒకరు.ఇటీవల ఈయన రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ రెండు సినిమాలు కూడా పూర్తిస్థాయిలో నిరాశ పరిచాయి.
ఇలా ఈయన సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustad Bhagath Singh)సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అవుతూ వస్తుంది.

ఇలా కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్న హరీష్ శంకర్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడ మాట్లాడలేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే ఇప్పటివరకు పిల్లల్ని కనకపోవడం గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ నేను నా భార్య స్నిగ్ధ ఇద్దరం కూర్చుని పిల్లల(Kids) గురించి బాగా చర్చించి పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.

మాజీ పూర్తిగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తన చెల్లెలు పెళ్లి చేశాను తమ్ముడిని లైఫ్ లో సెటిల్ చేసాము ఈ బాధ్యతలన్నీ తీర్చుకునేసరికి నేను చాలా అలసిపోయాను.మరి అలాంటి బాధ్యతలు మోయాలి అంటే చాలా కష్టమని తెలిపారు.ఇక పిల్లలు ఉంటే పూర్తిగా స్వార్థంగా మారిపోవాల్సి ఉంటుంది పైగా అన్నింటికీ అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి.
అందుకే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాము అంటూ హరీష్ శంకర్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అయితే ఈయన మాటలపై పలువురు విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.