చాలా మంది ముఖంపై పెట్టే శ్రద్ధ మెడ విషయంలో పెట్టనే పెట్టరు.ముఖానికి ఖరీదైన మాయిశ్చరైజర్, సీరం, క్రీమ్, సన్ స్క్రీన్ ఇలా రకరకాల ఉత్పత్తులు వాడుతుంటారు.
కానీ మెడను మాత్రం పట్టించుకోరు.ఫలితంగా మెడపై మృత కణాలు పెరిగిపోతాయి.
మెడ నల్లగా కాంతిహీనంగా మారుతుంది.ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్ కారణాల వల్ల కూడా మెడ నల్లగా మారుతుంది.
ముఖం ఎంత అందంగా తెల్లగా ఉన్నప్పటికీ. మెడ డార్క్( Neck dark ) గా ఉంటే ఏమాత్రం అట్రాక్టివ్ గా కనిపించలేదు.
అందుకే మెడ విషయంలో నిర్లక్ష్యం వద్దు.డార్క్ నెక్ ను వైట్ గా మార్చుకునేందుకు ప్రయత్నించండి.
అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీ ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ఈ రెమెడీతో వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ గమనిస్తారు.మరి ఇంతకీ మెడ ని తెల్లగా మార్చే ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ ( Oats )వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్ ను వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి,( sandalwood powder ) వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ) మరియు సరిపడా టమాటా జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మెడకు అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని మెడను స్క్రబ్బింగ్ చేసుకోవాలి.కనీసం నాలుగు నిమిషాల పాటు స్క్రబ్బింగ్ చేసుకున్న అనంతరం వాటర్ తో శుభ్రంగా మెడను క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మెడపై పేరుకుపోయిన మురికి, మృతకణాలు తొలగిపోతాయి.
క్రమంగా మెడ నలుపు తగ్గుతుంది.కొద్దిరోజుల్లోనే మెడ తెల్లగా కాంతివంతంగా మారుతుంది.
అలాగే ఈ రెమెడీని మీరు ముఖానికి కూడా ప్రయత్నించవచ్చు.ఈ రెమెడీతో స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.
ముఖంపై అధిక ఆయిల్ ఉత్పత్తి తగ్గుతుంది.ఓపెన్ ఫోర్స్ సైతం క్లోజ్ అవుతాయి.