శీతాకాలం రానే వచ్చింది.చలి రోజు రోజుకు పెరిగి పోతోంది.
ఈ సీజన్‌లో వాతావరణంతో పాటు మన శరీర ఉష్ణోగ్రతలు కూడా తగ్గి పోతుంటాయి.దాంతో చలిని తట్టు కోలేక తెగ ఇబ్బంది పడి పోతూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈ సీజన్‌లో శరీర ఉష్ణోగ్రతలను అద్భుతంగా పెంచుకోవచ్చు.మరి బాడీని హీట్ చేసే ఆ సూపర్ ఫుడ్స్ ఏంటీ.? అన్నది ఏ మాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చలి కాలంలో శరీరానికి వెచ్చ దనాన్ని ఇవ్వడంతో ఆకు కూరలు గ్రేట్‌గా ఉపయోగపడతాయి.
కాబట్టి.తోట కూర, గోంగూర, మెంతి కూర, బచ్చలి కూర వంటి ఆకు కూరలను వారంలో కనీసం మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటే చాలా మంచిది.
అలాగే శరీర ఉష్ణోగ్రతలను పెంచడంలో నువ్వులు సహయపడతాయి.పైగా నువ్వులను తీసుకుంటే రక్త హీనత పరార్ అవుతుంది.మధుమేహం అదుపులో ఉంటుంది.మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.
అందు వల్ల, ఈ చలి కాలంలో నువ్వులతో తయారు చేసిన లడ్డూలు, వంటల్లో నువ్వుల పొడిని ఉపయోగించి తీసుకోవడం చేయాలి.

రంగు రంగుల కూరగాయలతో తయారు చేసిన సూప్‌లను తరచూ తీసుకుంటూ ఉండాలి.తద్వారా చలి కాలంలోనూ వెచ్చగా ఉండొచ్చు.మరియు కూరగాయలతో చేసిన సూప్‌లను డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
బెల్లానికి కూడా శరీర ఉష్ణోగ్రతలను పెంచే సామర్థ్యం ఉంది.సో.ఈ సీజన్‌లో పంచదారకు బదులుగా బెల్లాన్ని వాడటానికే ప్రయత్నించండి.పైగా బెల్లం ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది.
ఇక మొక్క జొన్న, రాగులు, జొన్నలు వంటి తృణధాన్యాలతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఈ చలి కాలంలో వెచ్చగా ఉండోచ్చు.మరియు ఆరోగ్యంగానూ ఉండొచ్చు.