ఆ సినిమా షూటింగ్ లో అర్జున్, సౌందర్య కన్నీరు .. కారణమేంటి?

శ్రీ మంజునాథ. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2001లో విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసింది.

 Arjun And Sondarya Emotional In Srimanjunada Movie Shooting, Srimanjunada, Direc-TeluguStop.com

చిరంజీవి శివుడిగా.మీనా ఆయన భార్య పార్వతిగా నటించారు.

అర్జున్, సౌందర్య భార్యా భర్తలుగా కీరోల్ ప్లే చేశారు.ఓకే సారి తెలుగు, కన్నడ భాషల్లో రాఘవేంద్ర రావు ఈ సినిమాను రూపొందించాడు.

ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ హంసలేఖ సంగీతం అందించారు.వేద‌వ్యాస‌, జె.కె.భార‌వి, భువ‌న‌చంద్ర‌, జొన్న‌విత్తుల, చంద్ర‌బోస్‌, సామ‌వేదం ష‌ణ్ముఖ‌శ‌ర్మ‌, విశ్వ‌నాథ శాస్త్రి పాటలు రాశారు.ఈ సినిమా ఆడియో క్యాసెట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.

అటు ఈ సినిమా పాటలన్నీ మ్యూజికల్ హిట్ సాధించాయి.

విశ్వనాథ శాస్త్రి రంచించిన ఆనందా పరమానందా అనే పాటను ఎస్పీ బాల సుబ్రమణ్యం, నందిత అద్భుతంగా ఆలపించారు.ఈ పాట షూటింగ్ అనుభవాలను చిత్రయూనిట్ కొంతకాలం వరకు మర్చిపోలేదట.

వేద పండితులకు భోజనం పెడుతుండగా.వారి కుమారుడు చనిపోతాడు.

ఆవిషయం బయటకు తెలియకుండా భార్యభర్తలు వారికి ఆహారం వడ్డిస్తుంటారు.ఆ సమయంలో ఎంతో బాధను దిగమింగుకుంటారు.

అదే సమయంలో చక్కటి పాటపాడాలని అర్జున్ ను పండితులు కోరుతారు.కంటనీరు తుడుచుకుని ఆనందా పరమానందా అంటూ పాట అందుకుంటాడు అర్జున్.

ఆయనకు సౌందర్య తోడవుతుంది.ఈ పాట పాడతున్న సమయంలో అందరూ తీవ్ర భావోద్వేగానికి గురవుతారు.

Telugu Arjun, Arjunsoundarya, Raghavendra Rao, Manjunadha, Musical, Jayasri Devi

ఈ పాట కంప్లీట్ చేసి.అర్జున్, సౌందర్య మరో సినిమా షూటింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది.ఈలోగా సాంగ్ షూటింగ్ కంప్లీట్ అయ్యేలలా కననిపించలేదు.దాంతో ఇద్దర్నీ వెళ్లమని చెప్పింది నిర్మాత జయశ్రీ దేవి.ససరే అని వెళ్లిపోయారు.వేరే సినిమా షూటింగ్ కు వెళ్లినా.

అక్కడ కూడా ఇదే పాట గుర్తుకు వచ్చింది.వెంటనే నిర్మాతకు చెప్పి.

సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ చేయించారు.మళ్లీ వెళ్లి.

ఆనందా పరమానంద పాట షూటింగ్ కంప్లీట్ చేశారు.ఈ పాట చిత్రీకరణ తమ జీవితంలో మర్చిపోలేమని వెల్లడించింది చిత్ర యూనిట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube