ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నా సరే ఇలా చేస్తే నెల రోజుల్లో సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి!

ఇటీవల రోజుల్లో ఎముకల బలహీనత( bones ) అనేది చాలా మందిని పట్టిపీడిస్తోంది.శరీరానికి అసలైన నిర్మాణాన్ని ఇచ్చేది ఎముకలే.

 This Is A Drink That Makes Weak Bones To Super Strong! Weak Bones, Strong Bones,-TeluguStop.com

ఇవి బలంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు.లేకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వయసు పైబడే కొద్దీ ఎముకలు బలహీనంగా మారడం సర్వసాధారణం.కానీ ప్రస్తుత రోజుల్లో చాలామంది చిన్న వయసులోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

పోషకాల కొరత ఇందుకు ప్రధాన‌ కారణంగా మారుతుంది.దాంతో తక్కువ వయసులోనే ఎముకల బలహీనతకు గురవుతున్నారు.

దీని కారణంగా చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎముకలు విరగడం.మోకాళ్ళు, కీళ్ల నొప్పులు.ఎక్కువ సమయం పాటు నిలబడలేకపోవడం తదితర సమస్యలు తలెత్తుతుంటాయి.అయితే వీటన్నిటికీ చెక్ పెట్టి ఎముకలను బలంగా మార్చుకునేందుకు కొన్ని కొన్ని ఆహారాలు ఎంతో అద్భుతంగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను తీసుకుంటే ఎముకలు ఎంత బలహీనంగా ఉన్నా సరే నెల రోజుల్లోనే సూపర్ స్ట్రాంగ్ గా మారతాయి.మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Tips, Healthy, Latest, Weak-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు( Sesame seeds ), ఒక ఎండు ఖర్జూరం( Dry dates ), ఒక డ్రై అంజీర్ వేసుకుని ఒక కప్పు వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న నువ్వులు, గింజ తొలగించిన ఎండు ఖర్జూరం, అంజీర్ ను వాటర్ తో సహా వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పాలు( milk ) పోసుకోవాలి.ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పాలను బాగా మరిగించుకోవాలి.

Telugu Tips, Healthy, Latest, Weak-Telugu Health

ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన పాలల్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కలిపి సేవించడమే.రోజు ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎముకలకు అవసరం అయ్యే క్యాల్షియం, ప్రోటీన్, విటమిన్ కె తో సహా ఎన్నో విలువైన పోషకాలు అందుతాయి.దాంతో బలహీనంగా ఉన్న ఎముకలు కొద్ది రోజుల్లోనే దృఢంగా మారతాయి.ఎముకల సాంద్రత పెరుగుతుంది.మోకాళ్ళు, కీళ్ల నొప్పుల నుండి విముక్తి లభిస్తుంది.కాబట్టి ఎముకల బలహీనతతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ డ్రింక్ ను తయారు చేసుకొని తీసుకునేందుకు ప్రయత్నించండి.

ఎముకలను బలంగా ఆరోగ్యంగా మార్చుకోండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube