1.తెలంగాణలో నేడు ఆటోలు క్యాబ్ ల బంద్
తెలంగాణలో నేడు ఆటోలు, క్యాబ్ లు బంద్ పాటిస్తున్నాయి.రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టం 2019 అమలు చేస్తూ జరిమానాలతో దోపిడీ చేస్తోందని ఆరోపిస్తూ నేడు ఆటో క్యాబ్ లారీ డ్రైవర్ యూనియన్ ఐకాస రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు బంద్ కు పిలుపునిచ్చింది.
2.ఫిలిం ఛాంబర్ పై నిర్మాత సంచలన వ్యాఖ్యలు
పైరసీని అరికట్టడంలో ఫిలిం ఛాంబర్ విఫలమైందని నిర్మాత ఆదిశేషగిరి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
3.పెద్ద పులి సంచారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది.కమలాపూర్ అటవీ ప్రాంతంలో పులి సంచారం చేస్తున్నట్లుగా గ్రామ ప్రజలు పులి పాదముద్రలను గుర్తించారు.
4.రేపు నల్గొండ జిల్లాలో పవన్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన జనసేన క్రియాశీలక సభ్యుది కుటుంబానికి 5 లక్షలను పవన్ అందించనున్నారు.
5.24 నుంచి ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
ఈ నెల 24 నుంచి 14 రోజులపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు జరగనున్నాయి.
6.లోకేష్ ఆగ్రహం
విశాఖ జిల్లా పద్మనాభం మండలం లో రైతు భరోసా కార్యక్రమం లో పాల్గొన్న అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలపై అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తుండగా దీనిని కవర్ చేసిన మీడియా ప్రతినిధి పై నీ అంతు చూస్తా అంటూ అవంతి శ్రీనివాస్ బెదిరించిన ఘటనపై లోకేష్ స్పందించారు.పాత్రికేయుడు ని వైసీపీ నేతలు దూషించడం దారుణం అంటూ వ్యాఖ్యానించారు.
7.జగన్ ను కలిసిన రాజ్యసభ అభ్యర్థి
ఏపీ సీఎం జగన్ ను వైసీపీ రాజ్యసభ అభ్యర్థి బీద మస్తాన్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
8.జిజిహెచ్ కు జనసేన నేతలు అడ్డుకున్న పోలీసులు
జనసేన నేతలు గుంటూరు జిజిహెచ్ కు చేరుకున్నారు.అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లిన జనసేన నేతలను పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు.
9.జగన్ ప్రభుత్వం పై శైలజానాథ్ విమర్శలు
పేరు గొప్ప ఊరు దిబ్బ జగన్ ప్రభుత్వం ఉందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు.
10.రేవంత్ రెడ్డి విమర్శలు
దేశం కోసం ధర్మం కోసం మోదీ సర్కార్ మరో సారి గ్యాస్ ధరలు పెంచిందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
11.రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ 11 వ విడత నిధులు
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 11 వ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి.
12.సీఎం స్టాలిన్ ను కలుసుకున్న రాజీవ్ హంతకుడు
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడో నిందితుడైన ఏజీ పెరారివలన్ కలుసుకున్నారు.
13.పరీక్షా కేంద్రాల్లో మొబైల్ జామర్లు
కర్ణాటక రాష్ట్రంలో ఇక పై పోటీ పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల వద్ద మొబైల్ జామార్లు అమర్చాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
14.బూస్టర్ డోస్ ఉచితం కాదు : తమిళనాడు ఆరోగ్యశాఖ
బూస్టర్ డోస్ ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా పంపిణీ చేయలేమని తమిళనాడు ఆరోగ్యశాఖ ప్రకటించింది.
15.తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు
తెలంగాణలో ఆటోలు క్యాబ్ లు బందు దృష్ట్యా నిన్న అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది.
16.విద్యాశాఖ పై జగన్ సమీక్ష
ఈరోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు నాడు-నేడు పనుల పురోగతి ఇతర అంశాలపై ఆయన ఈ సమావేశంలో చర్చించారు.
17.నేడు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ సమావేశం
నేడు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ సమావేశం కానుంది ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
18.తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు
నేటి నుంచి తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరిగాయి.
19.చంద్రబాబు పర్యటన
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నారు.
20.వైయస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం
నేడు ఏపీలో వైఎస్ఆర్ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం కానున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా 340 పశువుల అంబులెన్స్ లను ఏర్పాటు చేయనున్నారు.