బత్తాయి పండు తో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? రోజు తింటే మాత్రం..?

మంచి ఆరోగ్యం కోసం రోజు ఒక పండు తినాలని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే రోజు మోసంబి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 Did You Know That There Are So Many Benefits Of Mosambi If You Eat Daily, Mosam-TeluguStop.com

ఈ పండులో విటమిన్ సి, ఏ, ఫాస్పరస్, పొటాషియం, కార్బోహైడ్రేట్, ఫోలేట్ లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్, యాంటీ అల్సర్ గుణాలు కూడా ఉంటాయి.

అలాగే ఇందులో ఉండే ఫైబర్ గట్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.అలాగే జీర్ణ క్రియ, మలబద్ధకం లాంటి సమస్యలు ఉన్నా కూడా మోసంబి( Mosambi ) తింటే వెంటనే ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.

Telugu Tips, Mosambi, Stress, Vitamin-Telugu Health Tips

అలాగే ఇందులో పీచు కలిగి ఉండడం వలన పొట్ట ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది.అలాగే మోసంబి మీద విటమిన్ సి, విటమిన్ ఏ, ఫైబర్ లాంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి మన శరీరానికి విటమిన్లు( VitaminS ) ఎంతో మేలు చేస్తాయి.దీని వినియోగంతో శరీరానికి ఎక్కువ పోషకాలు లభిస్తాయి.అలాగే బరువు అదుపులో ఉండాలంటే కూడా మోసంబినీ తినడం చాలా ఉత్తమం.మోసంబిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

అలాగే మోసంబి బరువు నియంత్రణలో ఉండడానికి ఎంతో సహాయపడుతుంది.అలాగే మీరు మీ బరువును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే ప్రతి రోజు ఒక మోసంబి తినడం చాలా మంచిది.

Telugu Tips, Mosambi, Stress, Vitamin-Telugu Health Tips

మోసంబి నీ తీసుకోవడం వలన మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.ఎందుకంటే మోసంబి తింటే ఇందులో ఉండే పోషకాలు ఒత్తిడి( Stress )ని తగ్గించడంలో ఎంతో గానో ఉపయోగపడతాయి.అంతే కాకుండా మానసిక ఆరోగ్యానికి మెరుగుపరిచే ఔషధం కంటే మోసంబి తక్కువ కాదు.అయితే మితిమీరి మోసంబి నీ తీసుకోవడం వలన జలుబు చేసే అవకాశం ఉంది.

అలాగే ఎలర్జీ, ఇన్ఫెక్షన్స్ ఉన్నవాళ్లు మోసంబికి దూరంగా ఉండటమే మంచిది.అంతే కాకుండా మోసంబిని ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube