చిరంజీవి బిగ్ బాస్ తో పోటీగా మోహన్ బాబు సినిమా..రెండు రాష్ట్రాల్లో సంచలనం ..ఎవరు నెగ్గారు

కుటుంబ విలువలను చాలా చక్కగా చూపించిన పెదరాయుడు సినిమా చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే.ఇప్పటికీ, ఎప్పటికీ.

 Mohan Babu Pedarayudu Movie Unknown Facts, Chiranjeevi Big Boss Movie, Pedarayud-TeluguStop.com

ఏ తరం ప్రేక్షకులకులనైనా అలరించగల ‘పెదరాయుడు’ మూవీ ఒక క్లాసిక్ అని చెప్పుకోవచ్చు.వాస్తవమేమిటంటే.1994 లో శరత్ కుమార్, మీనా, ఖుష్బు తారాగణంలో తెరకెక్కిన ‘నాట్టమ్మయి’ అనే తమిళ సినిమా ని చూసి రజినీకాంత్ బాగా ఇష్టపడ్డారు.వెంటనే తన స్నేహితుడైన మోహన్ బాబు కి ఫోన్ చేసి నాట్టమ్మయి సినిమా చాలా బాగుందని.

రీమేక్ రైట్స్ కొనుగోలు చేయమని చెప్పారు.దీనితో మోహన్ బాబు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆ తమిళ మూవీ రీమేక్ రైట్స్ కొన్నారు.

రీమేక్ సినిమాలు చేయడంలో సిద్ధహస్తుడైన డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి కి మోహన్ బాబు పెదరాయుడు మూవీ బాధ్యతలు అప్పజెప్పారు.

అలాగే ఒరిజినల్ మూవీ కి చాలా మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీ కి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సినిమాలో మోహన్ బాబు డబల్ రోల్ లో నటించగా .సౌందర్య, భానుప్రియ కీలక పాత్రలలో నటించారు.ఈ సినిమాలో స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్న అతి కీలకమైన ‘పాపారాయుడు’ పాత్రలో రజినీకాంత్ జీవించేసారనే చెప్పుకోవాలి.పాపారాయుడి పాత్ర నిడివి తక్కువయిందని మోహన్ బాబు సంకోచించి రజినీకాంత్ కి వేరే ఏదైనా పాత్ర ఇవ్వాలనుకున్నారు.

కానీ సినిమాలో ఆయువుపట్టు వంటి పాపారాయుడు పాత్రనే తాను చేస్తానని రజినీకాంత్ పట్టుబట్టారు.దీంతో మోహన్ బాబు కూడా రజినీకాంత్ మాట కాదనలేక పోయాడు.అయితే ఈ పాత్రను పోషించినందుకు గాను రజినీకాంత్ ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదు.

Telugu Bigboss, Chiranjeevibig, Mohan Babu, Pedarayudu Box, Pedarayudu-Telugu St

మోహన్ బాబు ధైర్యం చేసి పెదరాయుడు సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు.కె.ఎస్.రవికుమార్ కథ, జీ.సత్యమూర్తి డైలాగులను సమకూర్చారు.కోటి సంగీత బాణీలను అందించగా.ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హిట్ అయ్యాయి.జూన్ 15, 1995 న ‘పెదరాయుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు మోహన్ బాబు వచ్చారు.అయితే ఈ సినిమా అప్పట్లో విడుదలైన చిరంజీవి బిగ్ బాస్ మూవీ కి పోటీ ఇచ్చి 25 వారాల పాటు విజయవంతంగా ఆడి రికార్డులు సృష్టించింది.

ఘరానా మొగుడు సినిమా యొక్క ఇండస్ట్రీ హిట్ ని అనూహ్యంగా 2 కోట్ల మార్జిన్ తో తిరగరాసింది.చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఏకంగా 12 కోట్ల రూపాయలను మోహన్ బాబు కి సంపాదించిపెట్టింది.

అప్పట్లో బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల లెక్క పెట్టడానికి క్యాష్ మిషన్లను కూడా తెప్పించారు అంటే అతిశయోక్తి కాదు.మోహన్ బాబు సౌందర్య రజనీకాంత్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలోని అన్ని పాత్రల్లో నటించిన నటీనటులు అద్భుతమైన నటనా ప్రతిభను కనబరిచి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేశారు.

అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో పెదరాయుడు ఒక కళాఖండంగా నిలిచింది.తిన్నాం రికార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా 200 రోజులు కార్యక్రమానికి ఎన్టీరామారావు కూడా ముఖ్య అతిథిగా వచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube