తెలుగు తెరపై చాలా మంది హీరోలు అలా వస్తూ ఇలా వెళ్తూ ఉన్నారు.కానీ కొందరు మాత్రం వచ్చి అలా హిట్స్ మీద హిట్స్ కొట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని అంతే తొందరగా కనుమరుగై పోతున్నారు ఆ కోవకు చెందిన వారే హీరో అబ్బాస్.1996లో వచ్చిన ప్రేమదేశం సినిమాతో హీరోగా పరిచయమైన అబ్బాస్ ఆ తర్వాత చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు.ప్రేమదేశం సినిమాలో అబ్బాస్ వినీత్ ఇద్దరు హీరోలు కాగా వినీత్ కంటే కూడా ఆ సినిమాలో అబ్బాస్ కి బాగా పేరు వచ్చింది.
ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాల్లో హీరోగా చేసి హిట్ కొట్టి యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు హీరో అబ్బాస్, అయినప్పటికీ తన కెరీర్ ని లాంగ్ రన్ లో నిలవలేకపోయాడు.
వీళ్లతో పాటు హీరోయిన్ గా చేసిన టబు కి అనతికాలంలోనే మంచి పేరు వచ్చి పెద్ద హీరోయిన్ రేంజికి ఎదిగారు.కానీ అబ్బాస్ వినీత్ మాత్రం తర్వాత సినిమాలు చేసిన వాళ్ళకి పెద్దగా హిట్స్ రాకపోవడం వల్ల వాళ్లు పెద్ద హీరోలు కాలేకపోయారు.ఇప్పటికీ వినీత్ అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ అబ్బాస్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు ఎందుకు అంటే ప్రస్తుతానికి అబ్బాస్ ఇక్కడ ఉండటం లేదు.
అబ్బాస్ ప్రేమదేశం తర్వాత సాక్షి శివానంద్ తో వచ్చిన రాజహంస సినిమా చేశారు అది హిట్ అయినప్పటికీ తర్వాత అతను ఎంచుకున్న సినిమాలు పెద్దగా ఆడలేదు.ప్రేమ దేశం సినిమా తరహాలోనే అబ్బాస్ వినీత్ లు ఇద్దరూ కలిసి సురేష్ ప్రొడక్షన్స్ లో చేసిన నీ ప్రేమకై సినిమాలో వినీత్ హీరో కాగా అబ్బాస్ మాత్రం నెగిటివ్ రోల్ లో యాక్ట్ చేశాడు.
తర్వాత రజనీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమా లో రజనీకాంత్ అల్లుడు పాత్రలో యాక్ట్ చేసి మెప్పించాడు.అయినప్పటికీ తర్వాత పెద్దగా గుర్తింపు లేకపోవడంతో అబ్బాస్ కి అవకాశాలు చాలా తగ్గిపోయాయి తెలుగులో రవిబాబు డైరెక్ట్ చేసిన అనసూయ సినిమా లో భూమిక ప్రధాన పాత్ర పోషించగా అబ్బాస్ కూడా ఒక మంచి పాత్రలో కనిపించాడు.ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు కానీ మనకు ఈ రోజు టీవీలో వచ్చే హర్పిక్ యాడ్ లో మాత్రం కనిపిస్తాడు అవకాశాలు రాకపోవడంతో ఇలా యాడ్స్ చేస్తూ చివరికి ఏం చేయాలో తెలియక న్యూజిలాండ్ వెళ్లి అక్కడ ఏం చేయాలో తెలియక చాలా కష్టపడ్డాడు అబ్బాస్.
న్యూజిలాండ్ వెళ్ళిన మొదట్లో ఏం చేయాలో తెలియక ఒక పెట్రోల్ బంక్ లో పని చేశాడు తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో వర్క్ చేశాడు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు అక్కడే స్థిరపడ్డాడు.
కానీ ఒకప్పుడు మంచి హీరో అయిన అబ్బాస్ తనకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఎక్కడా కుంగిపోలేదు ఆస్ట్రేలియా పబ్లిక్ స్పీకర్ గా కూడా చేశాడు.కానీ తమ ఫేవరేట్ హీరో అయినా అబ్బాస్ ఒకప్పుడు మంచి సినిమాలతో అందర్నీ అలరించి చివరికి న్యూజిలాండ్లో పనిచేస్తూ బతకడం వాళ్ళ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు కానీ అబ్బాస్ ఫ్యాన్స్ అందరినీ ఉద్దేశించి ఒక మాట చెప్పాడు.
మనం ఒకటే ప్రపంచం అనుకుంటాం, మనం ఉన్న ఫీల్డ్ లో మనకు అవకాశాలు లేవు అనుకున్నప్పుడు మనం ఇంకో అవకాశాన్ని చూసుకుని మన లైఫ్ ని సెట్ చేసుకోవాలి అంతే తప్ప ఇంతకుముందు నేను చూసిన లైఫ్ ఇప్పుడు లేదు అని బాధ పడకూడదు.బాధపడి సూసైడ్ లాంటివి చేసుకోకూడదు.
జీవితంలో చాలా అవకాశాలు ఉంటాయి వాటిని మనం అందిపుచ్చుకొని మన వంతు ప్రయత్నంగా మన జీవితాన్ని మనం కొనసాగించాలి అంతే తప్ప పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఏదో చేసుకోకూడదు అని చెప్తున్నాడు.మొత్తానికి అబ్బాస్ తామున్న ఫీల్డులో అవకాశాలను కోల్పోయి ఏం చేయాలో తెలియక డిప్రెషన్ లోకి వెళ్ళిన చాలామందికి సెకండ్ లైఫ్ ఉంటుంది, అని దాని కోసం మనం బతకాలని తను బతికి జనాల తో పాటు తన ఫ్యాన్స్ కు కూడా ఒక మార్గదర్శిగా నిలిచాడు.
ఫ్యూచర్ లో అబ్బాస్ కి మంచి క్యారెక్టర్ వస్తే సినిమాల్లో మళ్లీ యాక్టింగ్ చేస్తాడో లేదో చూద్దాం…
.