టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో బాలకృష్ణ ( Balakrishna ) ఒకరు.బాల నటుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు.
ఇక బాలకృష్ణ ఇండస్ట్రీలో అందించిన సేవలకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.ఇలా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇలా పద్మ అవార్డుల జాబితాలో బాలయ్య పేరు కనిపించడంతో వెంటనే నందమూరి వారసులైనటువంటి ఎన్టీఆర్( NTR ), కళ్యాణ్ రామ్ ( Kalyan Ram )ఇద్దరు కూడా తన బాబాయికి శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు.అయితే ఈ విషయంలో కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కి నందమూరి కుటుంబం నుంచి ఘోరఅవమానం ఎదురయిందని తెలుస్తోంది.
బాలయ్యకు పద్మభూషణం అవార్డు రావడంతో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతూ పేపర్ యాడ్స్ ఇస్తున్నారు.

ఇలా ఈ యాడ్ తెలియజేస్తూ నందమూరి సోదరులు, సోదరీమణుల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించారు.కానీ ఎన్టీఆర్, ఆమె తల్లి శాలినీ పేర్లను ఎక్కాడా కూడా ప్రచురించలేదు.కల్యాణ్ రామ్ పేరును కూడా ప్రస్తావించలేదు కానీ ఆయన తల్లిదండ్రులైన హరికృష్ణ గారు, శ్రీమతి లక్ష్మి పేర్లను ప్రచురించారు కానీ ఎక్కడ కూడా ఎన్టీఆర్ కుటుంబం గురించి కళ్యాణ్ రామ్ పేర్లను ప్రచురించకపోవడంతో ఇది నిజంగానే ఎన్టీఆర్ కి అవమానమే అంటూ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

బాబాయ్ బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో ఈ ఇద్దరు అబ్బాయిలు సంతోషంతో శుభాకాంక్షలు చెప్పినప్పటికీ బాలకృష్ణ మాత్రం వారిని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది.ఇలా నందమూరి కుటుంబ సభ్యుల వ్యవహారం చూస్తుంటే ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ను తమ కుటుంబ సభ్యుడిగా స్వాగతించలేకపోతున్నారు అంటూ అభిమానులు మండిపడుతున్నారు.