చలికాలంలో( Winter ) మరింత ఎక్కువ జుట్టు రాలిపోవడం( Hairfall ) అనేది చాలా మందిలో కనిపించే సమస్య.చల్లని, పొడి శీతాకాలపు గాలి సహజ నూనెలను జుట్టు నుండి తీసి వేస్తుంది.
దీనివల్ల నెత్తిమీద రక్త ప్రసరణ తగ్గుతుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది.ఫలితంగా జుట్టు రాలడం అధికమవుతుంది.
అలాగే వేడి వేడి నీటితో తల స్నానం చేయడం, పోషకాల కొరత, హెయిర్ స్టైలింగ్ టూల్స్ ను అధికంగా వినియోగించడం తదితర కారణాల వల్ల కూడా జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ సమస్య నుంచి బయటపడడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ జాబితాలో మీరు కూడా ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.

జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టే బెస్ట్ సొల్యూషన్ ఒకటి ఉంది.దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా బౌల్ తీసుకుని అందులో ఒక గుడ్డు పచ్చ సొనను( Egg Yolk ) వేసుకోవాలి.అలాగే రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloevera Gel ) మరియు వన్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె లేదా ఆవనూనె లేదా కొబ్బరినూనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్కాల్ప్ కి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.30 నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారానికి ఒకసారి ఈ ఎగ్ మాస్క్ వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలను పొందుతారు.

గుడ్డు పచ్చసొన జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది.ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.గుడ్డు పచ్చసొనలోని ప్రోటీన్ జుట్టు కణాలలో కెరాటిన్ ఖాళీలను పునర్నిర్మించడంలో సహాయపడుతుంది.
గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ మరియు కె జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.గుడ్డు పచ్చసొనలో బయోటిన్ వెంట్రుకల కుదుళ్లను బలపరుస్తుంది.జుట్టు రాలడాన్ని, విరగడాన్ని సమర్థవంతంగా అరికడుతుంది.
అలాగే గుడ్డు పచ్చసొనలో లెసిథిన్ అనే ఫ్యాట్ జుట్టును తేమగా మార్చడంలో సహాయపడుతుంది.
ఇక అలోవెరా జెల్ మరియు కొబ్బరి నూనె, నువ్వుల నూనె, ఆవనూనె కూడా జుట్టు ఆరోగ్యాన్ని పోషిస్తాయి.జుట్టు రాలడాని అరికట్టడమే కాకుండా కురులను స్మూత్ గా మెరిసేలా ప్రోత్సహిస్తాయి.