ఈ రోజు పంచాంగం(Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 05.56సూర్యాస్తమయం: సాయంత్రం 06.12రాహుకాలం: సా.12.00 నుంచి 1.30 వరకుఅమృత ఘడియలు: సా 04.55 నుంచి 06.28 వరకు వరకుదుర్ముహూర్తం: సా 04.32 నుంచి 05.21 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:

అనవసరమైన వాటిలో తలా దూర్చకండి.ఇతరులలో తప్పులు వెతకడం మాని మీ పని మీరు చేసుకోండి! అనుకోని ఖర్చులు వచ్చి ఆర్ధికంగా ఇబ్బంది పెడుతాయి.ఈరోజు అంత బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.
వృషభం:

ఇంట్లో పరిస్థితులు అంత సంతోషంగా ఉంటాయి.ఖరీదైన వ్యాపారాల్లోకి అడుగు పెడతారు.అయితే వ్యాపారాల్లోకి వెళ్లేముందే ఒకటికి రెండు సార్లు తెలుసుకోండి.ఆర్ధికంగా లాభాలు ఉన్నప్పటికి పిల్లల చదువు విషయంలో కాస్త బాధపడతారు.
మిథునం:

ఈరోజు మొత్తం ప్రయాణంకే సరిపోతుంది.మీ వద్ద ఉన్న డబ్బు, సామాను ని జాగ్రత్తగా కాపాడుకోండి.స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.జాగ్రత్తగా పరిష్కరించుకోండి.ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.
కర్కాటకం:

ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.కాబట్టి చూసి ఖర్చు పెట్టుకోండి.అనవసరమైన విషయాల్లో దూరడం అవ్వడం మంచిది కాదు.నోటిని అదుపులో పెట్టుకుంటే మీకు ఎటువంటి సమస్యలు రావు.
సింహం:

ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.జాగ్రత్తగా ప్రశాంతంగా పనులు చేసుకోండి.తొందరపడితే ఇబ్బంది పడుతారు.
ఉద్యోగం విషయంలో కొన్ని ఇబ్బందులు వస్తాయ్.కానీ తెలివిగా పరిష్కరించుకోవాలి.జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
కన్య:

కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి ఇబ్బందులు పెడుతాయి.మీకు నచ్చని అతిథి వచ్చి మిమ్మల్ని అవమానిస్తారు.ఆర్ధిక సమస్యలు వచ్చినప్పటికీ సమయానికి డబ్బు అందుతుంది.ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
తులా:

మీ తొందరపాటు మిమ్మల్ని సమస్యల్లోకి నెట్టేస్తుంది.అందుకే ఏదైనా పని చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.పెద్దవారి సలహాలు తీసుకోవాలి.ఒత్తిడికి గురైన సమయంలో 10 నిముషాలు ధ్యానం చెయ్యడం మంచిది.
వృశ్చికం:

గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని బాధ పెడుతాయి.రుణాలు కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు కలసి వస్తుంది.బంధువుల నుంచి ఒక మంచి శుభవార్తను వింటారు.మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటారు.
ధనస్సు:
ఆరోగ్యం బాగుంటుంది.ఆర్ధిక ఇబ్బందులు వస్తాయ్.అయితే కొందరి ద్వారా ఆర్ధిక లాభాలు పొందగలరు.కానీ నీతి నిజాయితీగా ఉంటే మరింత మంచి జరుగుతుంది.ఖాళీ సమయంలో దేవుడిని పూజించడం, పుస్తకాలు చదవడం చేస్తే మంచిది.
మకరం:

మీ కోపాన్ని తగ్గించుకుంటే మంచిది.కుటుంబంతో, స్నేహితులతో సంతోషంగా ఉంటే మంచి జరుగుతుంది.పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బందులు పడుతారు.కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి!
కుంభం:

మీ కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.పెద్దవారితో వ్యాపారాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు.ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు సహాయపడతాయ్.
సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.ఉరుకులు పరుగుల మధ్య రోజు గడిచిపోతుంది.
మీనం:

మానసికంగా దృడంగా ఉండండి.వ్యాపారాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి.ఆర్ధికంగా లాభాలు ఉంటాయ్.తోటి ఉద్యోగులతో, మిత్రులతో సమయాన్ని సంతోషంగా గడుపుతారు.ఈరోజు మీ జీవిత భాగస్వామి కోసం ఏదైనా స్పెషల్ గా చేస్తారు.