భూగర్భంలో నిర్మించిన కైలాసనాథుని ఆలయం గురించి మీకు తెలుసా..?

భూగర్భంలో నిర్మించిన కైలాసనాథుని ఆలయం( Kailasanath Temple ) గురించి చాలామందికి తెలిసి ఉండదు.ఈ ఆలయం మందసౌర్ జిల్లాలోని గరోత్ తహసీల్లో ఉంది.

 Do You Know About Dharmrajeshwar Temple Built Underground Details, Dharmrajeshw-TeluguStop.com

ఇక ఈ దేవాలయం మొత్తం రాతితో కట్టబడింది.అది మందసౌర్ రావణుడు భార్యా మండోదరి( Mandodari ) స్వస్థలం అని నమ్ముతారు.

ఇక ధర్మ రాజేశ్వరాలయం( Dharmrajeshwar Temple ) మందసౌర్ లోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.ఈ ఆలయం ఏకశిలా ఆలయం.

అయితే 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 9 మీటర్ల లోతులో ధృడమైన సహజ శిలలతో చెక్కబడినది.అలాగే ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహంతో పాటు శివలింగం కూడా ఉంది.

Telugu Bhakti, Devotional, Maha Shivaratri, Mandodari, Ravana, Temple-Latest New

అయితే ప్రవేశద్వారం వద్ద విష్ణు భగవానుడు, లక్ష్మీదేవి యొక్క చెక్కబడిన చిత్రాలు కూడా అద్భుతంగా ఉంటాయి.ఇక ఈ మందిరం యొక్క శిఖరం ఉత్తర భారత శైలిలో ఉంటుంది.ఇక పెద్ద పిరమిడ్ ఆకారంలో ఆలయం మధ్యలో 14.53 మీటర్ల పొడవు అలాగే పది మీటర్ల వెడల్పుతో ఉంటుంది.అంతేకాకుండా ప్రధాన ఆలయంలో సభా మండపంతో కూడిన గర్భగుడి కూడా ఉంటుంది.అంతేకాకుండా గర్భగుడి చుట్టూ ఏడు చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.ఇక అందులో భైరవుడు, ఖాళీ, గరుడ, పార్వతీదేవి లాంటి వివిధ దేవతలకు అంకితం చేయబడినది.

Telugu Bhakti, Devotional, Maha Shivaratri, Mandodari, Ravana, Temple-Latest New

అంతేకాకుండా ఈ ఆలయం ఎల్లోరా లోని కైలాస దేవాలయాన్ని( Kailasa Temple ) పోలి ఉంటుంది అని చెబుతారు.ఇక ఈ ఆలయంలో రోజు వారి పూజలు, ఆచారాలు నిర్వహిస్తూ ఉంటారు.అయితే గుహ దేవాలయాన్ని సందర్శించడానికి అనుకూలమైన సమయం మాత్రం మహాశివరాత్రి( Maha Shivaratri ) అని చెప్పుకోవచ్చు.

ఈ దేవాలయానికి చాలామంది మహాశివరాత్రి నాడున వచ్చి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి దర్శించుకుంటారు.వేరే వివిధ ప్రాంతాల నుండి భక్తులు మహాశివ రాత్రి నాడు ఇక్కడికి వచ్చి వివిధ రకాలైన పూజలు నిర్వహించి వెళతారు.

కాబట్టి భూగర్భంలో నిర్మించిన ఈ కైలాసనాథుని ఆలయం కి ఎంతో విశిష్టత ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube