రోగ నిరోధక శక్తి( Immunity )ని బలోపేతం చేయడం నుండి శరీరాన్ని వెచ్చగా ఉంచడం వరకు శీతాకాలంలో నెయ్యి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.నెయ్యి వాసన ఏదైనా సరే ఈ వంటకం రుచిని పెంచుతూ ఉంటుంది.
అయితే చలికాలంలో ఆయుర్వేదం సిఫార్సు చేసిన ఆరోగ్యకరమైన ఆహారం ఏదైనా ఉందంటే అది నెయ్యి మాత్రమే అని చెప్పవచ్చు.నెయ్యి చర్మం, జ్ఞాపకశక్తి, రోగనిరోధక శక్తికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
శీతాకాలంలో రోజు తినే ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యిలో ఒమేగా 3, ఒమేగా 9, ఫ్యాటి యాసిడ్స్ లాంటి కొవ్వులు అద్భుతమైన మూలం.ఇక ఇందులో కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని( Heart health ) మెరుగుపరుస్తాయి.మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి, శరీరానికి కావాల్సిన బలాన్ని అందించడానికి శీతాకాలంలో నెయ్యిని మీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది.
జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా నెయ్యి గ్యాస్ట్రిక్ జ్యూస్లను కలిగి ఉంటుంది.ఆయుర్వేదంలో జీర్ణక్రియ( Digestion ) ప్రయోజనాల కోసం నెయ్యి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో నెయ్యి తీసుకోవడం వలన శరీరం చాలా వెచ్చగా ఉంటుంది.

నెయ్యిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడతాయి.చలికాలంలో ఎక్కువ చలితో వణికిపోయేవారు ఆహారంలో క్రమం తప్పకుండా నెయ్యి తీసుకోవడం వలన ఉపయోగకరంగా ఉంటుంది.నెయ్యిలో అధిక స్మోక్ పాయింట్ శీతాకాలంలో ఆహారాన్ని వండడంలో సహాయపడుతుంది.
శీతాకాలంలో పొడి, కఠినమైన వాతావరణం ఉంటుంది.ఇది చర్మంలో డిహైడ్రేషన్ కు కూడా కారణం అవుతుంది.
ఇది చర్మం పొడి బారకుండా లోపల నుండి తేమను కూడా అందిస్తుంది.ఈ ఆరోగ్యకరమైన ఆహారంలో కొవ్వు, ఆమ్లాలు కూడా ఉంటాయి.
ఇది చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.