భారతదేశం ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం అని చెప్పవచ్చు.మనదేశంలో వెలసిన ఒక్కో ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.
ఈ విధంగా మన దేశం లో వెలసిన ఆలయాలలో ఉన్న మూల విరాట్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయని చెప్పవచ్చు.ముఖ్యంగా మన దేశంలో ఏ ప్రాంతాలకు వెళ్ళిన ఆ పరమేశ్వరుడు ఆలయాలు మనకు దర్శనం కల్పిస్తాయి.
ఆ పరమేశ్వరుడిని భక్తిభావంతో పూజిస్తే వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తులు ఎంతగానో విశ్వసిస్తారు.ఈ విధంగా పరమేశ్వరుడు ఓ సాధారణ భక్తుడిని రక్షించడం కోసం నాదేశ్వర జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఆ పరమేశ్వరుడు తనని నమ్ముకున్న భక్తులకు వెన్నంటే ఉండి వారికి సహాయం చేస్తారని అర్థమవుతోంది.
మన దేశంలో ఇప్పటికే మహానగరాలలో వెలసిన జ్యోతిర్లింగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
ఈ విధంగా వెలిసిన జ్యోతిర్లింగాలలో మహారాష్ట్రలో కొలువై ఉన్న శ్రీ నాగ నాదేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి.పురాణాల ప్రకారం పాండవులు వనవాసం చేసిన సమయంలో ద్వారక వనంలో ఉన్నప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఔరంగజేబు హిందూ దేవాలయాలు అన్నింటిని కూల్చి వేస్తున్న సమయంలో ఈ ఆలయానికి రాగానే ఈ ఆలయంలో శరీరం నిండా పాములు ఉండి, త్రిశూలం చేతిలో పట్టుకొని ఉన్న నగ్న కాపాలికులు ఔరంగజేబు,అతని సైన్యం ఈ ఆలయాన్ని కూల్చకుండా, సైన్యాన్ని ఆలయం నుంచి తరిమి కొట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి.

శివుని మెడలో ఉన్నటువంటి నాగ పాము స్వరూపంగానే ఈ ఆలయానికి నాగ నాదేస్వరాలయం అనే పేరు వచ్చింది.ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకుంటే భక్తుల కోరికలు తప్పక నెరవేరుతాయని భావిస్తారు.ఈ ఆలయాన్ని దర్శించడం కోసం మహా శివరాత్రి పండుగ సందర్భాలలో భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు
.