ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) బరేలీలో లంచం( Bribe ) తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి కెమెరాకు చిక్కడం సంచలనంగా మారింది.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆలంపూర్ జఫరాబాద్ బ్లాక్‌కు చెందిన చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ( CDPO ) ఈ లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీడియోలో సీడీపీఓ ఏకంగా 70 వేల రూపాయలు లంచం తీసుకుంటూ స్పష్టంగా కనిపిస్తున్నారు.
అంగన్‌వాడీలో( Anganwadi ) ఉద్యోగం వస్తుందని ఆశతో ఆ మహిళ డబ్బులు ముట్టజెప్పింది.లంచం ఇచ్చినా కూడా ఉద్యోగం మాత్రం రాలేదు.దీంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ వెంటనే అధికారులకు కంప్లైంట్ చేసింది.ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.
మహిళ కంప్లైంట్ ఇవ్వగానే అధికారులు వెంటనే రంగంలోకి దిగారు.బరేలీ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సీడీఓ) స్వయంగా ఈ కేసును టేకప్ చేశారు.వెంటనే ప్రాథమిక విచారణ జరిపి, పూర్తి రిపోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.
ప్రస్తుతం వికాస్ భవన్ ఏరియా పరిధిలోని బారాదరి పోలీసులు ఈ కేసుపై ఫుల్ ఫోకస్‌తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
వీడియో నిజమైనదా కాదా, డబ్బు చేతులు మారిందా లేదా అని అన్ని కోణాల్లోనూ చెక్ చేస్తున్నారు.ఒకవేళ ఆ అధికారిణి నిజంగానే తప్పు చేసిందని తేలితే మాత్రం, చట్ట ప్రకారం ఊహించని చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.
ఈ ఒక్క ఘటనతో ప్రభుత్వ ఉద్యోగాల ఎంపికలో జరుగుతున్న అవినీతి గురించిన భయంకరమైన నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.పేద ప్రజలు, ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులు.వీళ్ళందరినీ అధికారంలో ఉన్నవాళ్లు ఇంత దారుణంగా మోసం చేస్తున్నారా అని ప్రజలు మండిపడుతున్నారు.
అంగన్‌వాడీ ఉద్యోగాల నియామకాల్లో పారదర్శకత, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అందరూ గట్టిగా వాదిస్తున్నారు.
ఎందుకంటే ఈ ఉద్యోగాలు పిల్లలకి, మహిళలకి సపోర్ట్ చేయడానికి కదా.ఇంకా ఈ కేసు విచారణ దశలోనే ఉంది.ముందు ముందు ఇంకెన్ని ట్విస్టులు బయటపడతాయో చూడాలి.